Movie News

అగ్నికి ఆహుతైన ఫేమస్ థియేటర్

హైదరాబాద్‌‌లో కూకట్ పల్లి ప్రాంతంలో ఉన్న వాళ్లకు శివ పార్వతి థియేటర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సిటీలోనే మంచి పేరున్న థియేటర్లలో ఒకటది. అక్కడ ఎప్పుడూ పేరున్న సినిమాలే రిలీజవుతుంటాయి. పెద్ద హీరోల సినిమాలకు అప్పుడప్పుడూ ఫ్యాన్స్ షోలు వేయడానికి కూడా ఈ థియేటర్‌నే ఎంచుకుంటూ ఉంటారు. గత ఏడాది పవన్ కళ్యాణ్ సినిమా ‘వకీల్ సాబ్’కు కూడా స్పెషల్ షో అక్కడే వేశారు.

ఈ ఫేమస్ థియేటర్ ఇప్పుడు అగ్ని ప్రమాదం కారణంగా నామరూపాల్లేకుండా నాశనం కావడం ఆ ప్రాంత సినీ ప్రేమికుల్ని కలచి వేస్తోంది. ఆదివారం అర్ధరాత్రి దాటాక జరిగిన ప్రమాదంలో ఒక్కసారిగా చెలరేగిన మంటలు థియేటర్ మొత్తాన్ని చుట్టుముట్టాయి. సినిమా హాలులోని స్క్రీన్, కుర్చీలు, ఇతర సామగ్రి కాలి బూడిదైంది. మంటలు పెద్ద ఎత్తున ఎగసిపడడంతో పైకప్పు కూడా కూలిపోవడం గమనార్హం. 

ఈ థియేటర్లో పది రోజుల నుంచి నాని సినిమా ‘శ్యామ్ సింగ రాయ్’ ఆడుతోంది. ఆదివారం కూడా ఈ సినిమా సెకండ్ షోను నడిపించారు. ఐతే షో పూర్తయ్యాక కాసేపటికి షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. ఆ సమయానికి థియేటర్లో ఎవ్వరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. థియేటర్ వెలుపల ఉన్న సెక్యూరిటీ సిబ్బంది గుర్తించేసరికే లోపల పరిస్థితి అదుపు తప్పింది.

సమాచారం అందుకున్న వెంటనే థియేటర్ వద్దకు చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మూడు ఫైరింజన్లతో అక్కడికి చేరుకున్నారు. మూడు నాలుగు గంటల పాటు శ్రమించి మంటలను అదుపు చేశారు. ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కాకుండా వేరే కారణాలేవీ లేవనే భావిస్తున్నారు. ప్రమాదంలో దాదాపు రూ. 2 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. థియేటర్ కాలిపోతోన్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 

This post was last modified on January 3, 2022 12:18 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

పార్ట్ 2 మంత్రం పని చేయలేనట్టేనా…?

విడుదల పార్ట్ 1 వచ్చినప్పుడు తెలుగులో మంచి ప్రశంసలు దక్కాయి. కమర్షియల్ గా సూపర్ హిట్ కాదు కానీ నష్టాలు…

44 minutes ago

వైల్డ్ ఫైర్ ఎఫెక్ట్ : ఆంధ్ర వైపు సంక్రాంతి సినిమాల చూపు!

పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం, ఆమె తనయుడు చావు బతుకుల మధ్య…

1 hour ago

ఉదయం 4 గంటలకు డాకు మహారాజ్ షోలు : సాధ్యమేనా?

రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు మారాక బెనిఫిట్ షోలు, అదనపు రేట్లకు సులువుగానే అనుమతులు వచ్చేస్తుండడంతో టాలీవుడ్ నిర్మాతలు చాలా…

1 hour ago

పుష్ప కాదు జై భీమ్ హీరో అంటోన్న సీతక్క!

తెలంగాణలో కాంగ్రెస్ నేతలు వర్సెస్ అల్లు అర్జున్ వ్యవహారం ముదిరి పాకాన పడింది. అల్లు అర్జున్ పై అసెంబ్లీలో సీఎం…

3 hours ago

చిరంజీవి ఫ్యాన్స్ తిట్టుకున్నా సరే..

మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల మధ్య సినిమాల పరంగా దశాబ్దాల నుంచి పోటీ నడుస్తోంది. వీరి అభిమానుల మధ్య ఉండే…

3 hours ago

రేవంత్ దగ్గరికి సినీ పెద్దలు?

పెద్ద సినిమాలకు అర్ధరాత్రి అయినా, తెల్లవారుజామున అయినా స్పెషల్ షోలు వేసుకోవాలంటే సులువుగా అనుమతులు.. అలాగే రేట్లు ఎంత పెంచుకోవాలని…

4 hours ago