‘పుష్ప’ సినిమా రిలీజై రెండు వారాలు దాటింది. మూడో వారంలోకి అడుగు పెట్టిన ఈ చిత్రం నార్త్ ఇండియాలో సాధిస్తున్న వసూళ్లకు అక్కడి ట్రేడ్ పండిట్లు విస్తుబోతున్నారు. ఈ వారం రావాల్సిన ‘జెర్సీ’ సినిమా వాయిదా పడటంతో ‘పుష్ప’ పండగ చేసుకుంటోంది. ఈ శనివారం ‘పుష్ప’ సాధించిన వసూళ్లు చూసి బాలీవుడ్ వాళ్లకు దిమ్మదిరిగిపోతోంది. విడుదలైన 16వ రోజు ఆ చిత్రం హిందీలో ఆరున్నర కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది.
బాలీవుడ్ సూపర్ స్టార్ల సినిమాలకు కూడా రిలీజైన ఇన్ని రోజుల తర్వాత ఈ వసూళ్లు రావడం కష్టం. ఈ ఏడాది హిందీలో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన ‘సూర్యవంశీ’ మూడో వారాంతంలో, రిలీజైన 16వ రోజు రూ.3.77 కోట్ల గ్రాసే కలెక్ట్ చేసింది. అలాంటిది ఒక డబ్బింగ్ సినిమా, రిలీజ్ ముంగిట పెద్దగా అంచనాలు కూడా లేని చిత్రం మూడో వీకెండ్లో ఒక్క రోజులో ఆరున్నర కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయడం అంటే మామూలు విషయం కాదు.
ఇంకా పెద్ద విశేషం ఏంటంటే.. ఇప్పటిదాకా ‘పుష్ఫ’ ఒక్క రోజులో కలెక్ట్ చేసిన అత్యధిక మొత్తం కూడా ఇదే. తొలి రోజు, తొలి వారాంతంలో కూడా ఏ రోజూ ఈ స్థాయిలో వసూళ్లు రాలేదు. ఒక సినిమాకు విడుదలైన 16వ రోజు హైయెస్ట్ సింగిల్ డే కలెక్షన్లు రావడం అన్నది బహుశా ఒక రికార్డు కావచ్చేమో. నెమ్మదిగా ‘పుష్ప’ హిందీ జనాలకు బాగా ఎక్కేస్తోందనడానికి ఇది రుజువు. ‘పుష్ప’ హిందీలో ఇంత బాగా ఆడుతుందన్న అంచనాలు ఎవ్వరికీ లేవు.
ఈ చిత్ర దర్శకుడు సుకుమారే ఈ విషయంలో షాకవుతున్నాడు. హిందీలో రిలీజ్ గురించి హడావుడి చేస్తుంటే తాను లోలోన నవ్వుకున్నట్లుగా సుకుమార్ ఇటీవల వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. మొత్తంగా శనివారం నాటికి ఈ చిత్రం హిందీలో రూ.57 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. ‘జెర్సీ’తో పాటు ‘ఆర్ఆర్ఆర్’ సైతం వాయిదా పడటంతో ‘పుష్ప’ డ్రీమ్ రన్ ఇంకా కొన్ని రోజులు కొనసాగబోతోంది. ఫుల్ రన్లో ఈ చిత్రం అక్కడ రూ.75 కోట్ల గ్రాస్ మార్కును కూడా ఈజీగానే టచ్ చేసేలా ఉంది.
This post was last modified on January 2, 2022 2:26 pm
ఏపీలో లేడీ డాన్లు పెరిగిపోయారు.. వారి తోక కట్ చేస్తానంటూ సీఎం చంద్రబాబు నాయుడు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈరోజు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…