రామ్ చరణ్ తో కాదని నెట్ ఫ్లిక్స్ కి!

శ్రీదేవి కూతురు హీరోయిన్ గా వస్తుందని ప్రచారంలో ఉన్నప్పుడు ఆమె చుట్టూ ఉన్న హైప్ హీరోయిన్ అయ్యాక లేకుండా పోయింది. ఆమె నటి కాకముందు తెలుగులో రామ్ చరణ్ సరసన సినిమా అనుకున్నారు. పలువురు అగ్ర హీరోల కోసం ఆమెను సంప్రదించారు.

అయితే తెలుగులో నటిస్తే బాలీవుడ్లో క్రేజ్ తగ్గిపోతుందని ఆమెను కరణ్ జోహార్ కు అప్పగించారు. అతనేమో తనతో చిన్న సినిమాలు తీస్తున్నాడు. మొదటి సినిమా పాతిక కోట్ల లోపు బిజినెస్ కే పరిమితం కాగా రెండో సినిమా నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ అవుతోంది. ఆమెతో అనుకున్న మరో సినిమా రైట్స్ కూడా ఓటిటీకి ఇచ్చేశారట. ఇప్పటికే చిన్న హీరోయిన్ అనే ముద్ర పడిపోగా, ఇక ఈ నెట్ ఫ్లిక్స్ రిలీజ్ దెబ్బకు జాన్వీ కపూర్ ఒక మాదిరి సినిమాలు రాబట్టడం కూడా కష్టమే.

కరణ్ జోహార్ సినిమాల కారణంగా పూరి ఫైటర్ లో కూడా ఆమె నటించలేకపోయింది. దీంతో ఇప్పుడు తెలుగులో మంచి ఆఫర్స్ వస్తాయేమో అని బోనీ కపూర్ ఇటు చూస్తున్నారు. వకీల్ సాబ్ తో ఇక్కడ ఎంటర్ అయ్యారు కనుక టాలీవుడ్ మీద ఫోకస్ పెడుతున్నారు. కానీ మునుపు ఉన్న హైప్ ఇప్పుడు లేదు కనుక మన అగ్ర హీరోలతో అవకాశాలు రావాలంటే కాస్త కష్టమే.