టాలీవుడ్ లో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా దూసుకుపోతున్నారు తమన్. ప్రస్తుతం ఇండస్ట్రీలో తెరకెక్కుతోన్న భారీ బడ్జెట్ సినిమాలన్నింటికీ తమనే మ్యూజిక్ అందిస్తున్నారు. ‘అఖండ’ సినిమా సూపర్ హిట్ కావడానికి ప్రధాన కారణం తమన్. ఆయన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కి థియేటర్లు దద్దరిల్లిపోతున్నాయి. ఇప్పుడు ‘రాధేశ్యామ్’ సినిమాకి కూడా బీజియమ్ కోసం ప్రత్యేకంగా తమన్ ను తీసుకున్నారు. ఇదిలా ఉండగా.. రీసెంట్ గా తమన్ పెట్టిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఆ ట్వీట్ నానిని ఉద్దేశించే పెట్టారంటూ నెటిజన్లు ఫిక్సయిపోయారు. అసలేం జరిగిందంటే.. ‘శ్యామ్ సింగరాయ్’ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నాని ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అందులో ఆయన.. సాంగ్ అనేది సినిమాను ఎలివేట్ చేసేలా ఉండాలి కానీ డామినేట్ చేయకూడదని.. పాట మాత్రమే కాకుండా ఏ క్రాఫ్ట్ అయినా సరే సినిమాను డామినేట్ చేస్తే.. అదొక్కటే బాగా కనిపిస్తే.. ఏదో తప్పు ఉందని అర్ధమని నాని అన్నారు. అన్నీ కలిసి సినిమాను గొప్ప సినిమా అనిపించేలా చేయాలని తను అదే నమ్ముతానని నాని చెప్పుకొచ్చారు.
ఇక రీసెంట్ గా తమన్ చేసిన ట్వీట్ ఏంటంటే.. సినిమాలో అన్ని డిపార్ట్మెంట్స్ వర్క్ పెర్ఫెక్ట్ గా చేస్తేనే దాన్ని కంప్లీట్ సినిమా అని అంటాం. అంతేకానీ.. ఒకరు డామినేట్ చేశారని అనరు.. అంటూ నవ్వారు తమన్. సినిమాను అర్ధం చేసుకోవడానికి లోతైన అవగాహన అవసరమని.. డైలాగ్స్ లో డెప్త్, సీక్వెన్స్ లో స్మూత్ గా వెళ్లే నేరేషన్.. గొప్ప విజువల్స్, గొప్ప క్యారెక్టర్లు, ఎమోషన్స్ లో నిజాయితీ.. మంచి స్క్రిప్ట్, సరైన డైరెక్షన్, నటీనటుల పెర్ఫార్మన్స్ అన్నీ బాగా వచ్చినప్పుడు.. సినిమా వన్ మ్యాన్ షో కాదని అన్నారు.
‘వి లవ్ సినిమా.. అండ్ వి డై ఫర్ ఇట్’ అంటూ చాలా ఎమోషనల్ గా రాసుకొచ్చారు తమన్. ఈ ట్వీట్స్ చూసిన ఫ్యాన్స్ అయితే ఇది నానికి కౌంటర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. నాని నటించిన ‘టక్ జగదీష్’ సినిమా నుంచి తమన్ ను తప్పించారు. అప్పటినుంచి ఇద్దరి మధ్య ఏదో గ్యాప్ వచ్చినట్లు కథనాలు వస్తున్నాయి.
This post was last modified on December 31, 2021 2:29 pm
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…