‘గుండె జారి గల్లంతయ్యిందే’ లాంటి సూపర్ హిట్ మూవీతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు యువ దర్శకుడు విజయ్ కుమార్ కొండా. ఐతే తొలి సినిమా తర్వాత తనపై పెరిగిన అంచనాలను అందుకోలేకపోయాడు. రెండో చిత్రం ‘ఒక లైలా కోసం’ ఓ మోస్తరుగా ఆడగా.. ఆ తర్వాత అతణ్నుంచి వచ్చిన ఒరేయ్ బుజ్జిగా, పవర్ ప్లే పూర్తిగా నిరాశ పరిచాయి. టాలీవుడ్లో అతడి కెరీర్‌కు దాదాపుగా బ్రేకులు పడ్డట్లే కనిపిస్తోంది. ఐతే ఈలోపు విజయ్‌కి కన్నడలో మంచి అవకాశం వచ్చింది.
మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి కొడుకు నిఖిల్ హీరోగా నటించిన చిత్రమిది. ఇతను ‘జాగ్వార్’ అనే మూవీతో హీరోగా పరిచయం అయిన సంగతి తెలిసిందే. బాహుబలి తర్వాత విజయేంద్ర ప్రసాద్ రచనలో, రాజమౌళి శిష్యుడు మహదేవ్ దాదాపు 75 కోట్ల బడ్జెట్లో ఈ సినిమా తీశాడు. కానీ అది నిఖిల్‌కు హిట్ అందించలేకపోయింది. ఆ తర్వాత కూడా సరైన విజయాలు దక్కలేదతడికి.
ఇప్పుడు నిఖిల్‌ను హీరోగా నిలబెట్టే బాధ్యత విజయ్‌పై పడింది. వీరి కలయికలో ‘రైడర్’ అనే సినిమా తెరకెక్కింది. క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘రైడర్’ అంతగా ఆకట్టుకోలేకపోయింది. మాజీ సీఎం కొడుకు సినిమా, పైగా సొంత బేనర్లో తెరకెక్కింది కాబట్టి ఖర్చు పరంగా రాజీయే లేదు. రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్‌తో, పేరున్న కాస్ట్ అండ్ క్రూతో సినిమా తీశారు. కానీ ప్రొడక్షన్ క్వాలిటీ కనిపించినా.. కథాకథనాలు అనుకున్నంత స్థాయిలో లేకపోవడంతో ఈ సినిమాకు మిక్స్‌డ్ రివ్యూలే వచ్చాయి.
చిన్నపుడు అనాథాశ్రమంలో పెరిగిన మధ్యలో విడిపోయిన హీరో హీరోయిన్లు.. తిరిగి ఒకరినొకరు ఎలా కలిశారన్న కథకు కమర్షియల్ టచ్ ఇస్తూ విజయ్ సినిమా తీశాడు. కథ పరంగా కొత్తదనం లేకపోవడం.. ట్రీట్మెంట్ కూడా రొటీన్ కమర్షియల్ సినిమాల తరహాలోనే ఉండటంతో సినిమాకు ఆశించినంత స్పందన రాలేదు. ఓపెనింగ్స్ పర్లేదనిపించినా.. బాక్సాఫీస్ దగ్గర సినిమా నిలబడలేదని అక్కడి క్రిటిక్స్, ట్రేడ్ పండిట్స్ చెబుతున్నారు. కానీ చిత్ర బృందం సినిమా బ్లాక్‌బస్టర్ అంటూ విజయయాత్ర చేస్తోంది.
This post was last modified on December 30, 2021 7:23 pm
ఏపీలో 175 నియోజకవర్గాలు ఉన్నాయి. అయితే.. వీటిలో కొన్ని చాలా వెనుకబడి ఉన్నాయి. మరికొన్ని మధ్యస్థాయిలో అభివృద్ధి చెందాయి. ఇంకొన్ని…
ఒక పెద్ద సినీ కుటుంబానికి చెందిన కొత్త కుర్రాడు ఇండస్ట్రీలోకి అడుగు పెడుతుంటే.. డెబ్యూ మూవీ చేస్తుండగానే వేరే చిత్రాలు…
రాజకీయ పార్టీలకు ప్రముఖ సంస్థలు విరాళాలు ఇవ్వడం కొత్తకాదు. అయితే.. ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క విధంగా విరాళాలు ఇవ్వడం(వాటి ఇష్టమే…
కోనసీమ కొబ్బరి తోటలకు తెలంగాణ నాయకుల దిష్టి తగిలిందంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ…
ఒకప్పుడు ఏపీలో హెచ్ ఐవీ ఎక్కువగా ఉండేది. హైవేల పక్కన ఎక్కువ కండోమ్ లు కనపడేవి అని సీఎం చంద్రబాబు…
ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సీఎం చంద్రబాబు విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా…