ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్స్ బాగా క్లిక్ అవుతుంటాయి. అది హీరో హీరోయిన్లు కావొచ్చు.. దర్శకుడు నిర్మాత కావచ్చు.. హీరో దర్శకుడూ కూడా అయ్యుండొచ్చు. ఈ మూడో కేటగిరీకి చెందినవారే మలయాళ హీరోలు మోహన్‌లాల్, పృథ్విరాజ్ సుకుమారన్. వీళ్లిద్దరిదీ సూపర్ హిట్ కాంబో అనడంలో సందేహమే లేదు.
ఓ సినిమా తీసి, అది సక్సెస్ అయితే మళ్లీ మళ్లీ పని చేసేవారు ఉంటారు. కానీ వీళ్ల రూటే వేరు. పృథ్విరాజ్‌కి మోహన్‌లాల్ అంటే వల్లమాలిన అభిమానం, ఆరాధన. ఓ స్టార్ హీరో అయ్యుండి కూడా ఏమాత్రం ఇగో లేకుండా లాల్‌కి వీరాభిమానిని అని చెప్పుకుంటాడు. ఆ అభిమానంతోనే లూసిఫర్ సినిమా తీశాడు. అందులో మోహన్‌లాల్ ఎలివేషన్లు అదిరిపోవడానికి కారణం ఆయనపై పృథ్విరాజ్‌కి ఉన్న ఇష్టమే. తన ఫేవరేట్ హీరోని అలా చూపించేందుకే ఆ సినిమా తీశాడు. బ్లాక్ బస్టర్ కొట్టాడు.
ఇప్పుడు మరోసారి ఆయనతో బ్రోడాడీ అనే సినిమా తీస్తున్నాడు పృథ్వి. పేరుతోనే క్యూరియాసిటీని క్రియేట్ చేసిన ఈ సినిమాని నలభై నాలుగు రోజుల్లోనే షూట్ చేసేశాడు. మొత్తం హైదరాబాద్‌లోనే తీశాడు. ఆంటోనీ పెరంబవూర్‌తో కలిసి నిర్మిస్తున్నాడు కూడా. లూసిఫర్‌లో చిన్న పాత్రలో కనిపించినవాడు ఈ సినిమాలో లాల్‌తో కలిసి ఫుల్ లెంగ్త్ రోల్ చేస్తున్నాడు. జనవరి 26న మూవీ హాట్‌స్టార్‌లో రిలీజ్ కానుంది. ఇవాళ ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు. సూటూ బూటూ వేసుకుని యమా స్టైలిష్‌గా, రిచ్ లుక్‌లో ఉన్నారిద్దరూ. చూసినవాళ్లంతా హిట్ పెయిర్ అంటూ కామెంట్ చేస్తున్నారు.
మరో విశేషం ఏమిటంటే ఈ హిట్ పెయిర్ మరోసారి కూడా రిపీట్ కానుంది. మరో మూవీకి కూడా ఇద్దరూ కలిసి పని చేయబోతున్నారు. కాకపోతే ఈసారి వీళ్ల రోల్స్ మాత్రం రివర్స్ అవుతున్నాయి. మోహన్ లాల్ నటిస్తూ డైరెక్ట్ చేస్తున్న ‘బారోజ్’లో ఒక కీలక పాత్ర చేయబోతున్నాడు పృథ్వి. ఇప్పటి వరకు ఆయన్ని డైరెక్ట్ చేసి ఆనందపడినవాడు, ఇప్పుడు ఆయన తనను డైరెక్ట్ చేస్తున్నందుకు ఆనందంతో పొంగిపోతున్నాడు. ఏదేమైనా ఇద్దరు స్టార్ హీరోల మధ్య ఇగోకి తావులేని ఇంత మంచి బాండింగ్ ఉండటం కాస్త అరుదనే చెప్పాలి.
This post was last modified on December 29, 2021 7:17 pm
అగ్రరాజ్యం అమెరికాలో చోటు చేసుకున్న పరిణామాలు.. విదేశీ విద్యార్థులు, వృత్తి నిపుణులను ఇరకాటంలోకి నెడుతున్నాయి. మరో రెండు మూడు వారాల్లోనే…
జైలు శిక్ష ఏమిటి? అందులోనూ ఫిఫ్టీ-ఫిఫ్టీ ఏమిటి- అనే ఆశ్చర్యం అందరికీ కలుగుతుంది. కానీ, ఇది వాస్తవం. దీనికి సంబంధించి…
ఏపీలో రాజకీయ వ్యూహాలు, ప్రతివ్యూహాలు ఎలా ఉన్నా.. అధికార పార్టీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు మాత్రం కాక పుట్టిస్తున్నాయి. ఇప్పటికే…
టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పరిటాల రవి గురించి యావత్ ఉమ్మడి రాష్ట్రానికి తెలిసిందే. అన్నగారు ఎన్టీఆర్ పిలుపుతో…
క్రిస్మస్‌కు తెలుగులో భారీ చిత్రాల సందడి ఉంటుందని అనుకున్నారు కానీ.. ఈ సీజన్లో వస్తాయనుకున్న గేమ్ చేంజర్, తండేల్, రాబిన్…