ఈ మధ్యకాలంలో కోవిడ్ కేసులు మళ్లీ పెరిగిపోతున్నాయి. సెకండ్ వేవ్ తరువాత ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ప్రజలను ఒమిక్రాన్ అంటూ మరో వేరియంట్ వెంటాడుతోంది. ఇప్పటికే హైదరాబాద్, ముంబై, కేరళ ఇలా చాలా రాష్ట్రాల్లో ఒమిక్రాన్ కేసులు బయటపడుతున్నాయి. అలానే మరికొందరు కోవిడ్ బారిన పడుతున్నారు. రీసెంట్ గా కమల్ హాసన్, కరీనా కపూర్ లాంటి స్టార్లకు కోవిదు సోకింది. రెండు వ్యాక్సిన్లు వేయించుకున్నప్పటికీ వారికి కోవిడ్ సోకడంతో హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకొని బయటపడ్డారు.
ఈ మధ్యనే కోలీవుడ్ స్టార్ కమెడియన్ వడివేలు సైతం కోవిడ్ బారిన పడ్డారు. ఆయనకు ఒమిక్రాన్ సోకిందేమోనని డాక్టర్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా టాలీవుడ్ హీరో మంచు మనోజ్ కి కోవిడ్ పాజిటివ్ వచ్చింది. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. లాస్ట్ వీక్ లో తనను కలిసివారిని వెంటనే టెస్ట్ లు చేయించుకోవాలని సూచించారు.
తన గురించి ఆందోళన చెందొద్దని.. డాక్టర్స్, నర్స్ ల కేర్ లో ఉన్నట్లు చెప్పారు. ఈ ట్వీట్ పై స్పందించిన నెటిజన్లు ఆయన త్వరగా కోలుకోవాలంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇక మంచు మనోజ్ కెరీర్ విషయానికొస్తే.. ఆయన సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ఆయన చివరిగా హీరోగా నటించిన సినిమా ‘ఒక్కడు మిగిలాడు’. ఆ తరువాత ఇప్పటివరకు మరో సినిమా చేయలేదు. ‘అహం బ్రహ్మాస్మి’ అనే ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి చాలా కాలమవుతున్నా.. ఆ సినిమా ఇంకా పట్టాలెక్కలేదు.
This post was last modified on December 29, 2021 11:21 am
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్‌షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…