టాలీవుడ్ టాప్ డైరెక్టర్ల లిస్టు తీస్తే అందులో రాజమౌళి, సుకుమార్‌ల పేర్లు కచ్చితంగా ఉంటాయి. ఇద్దరూ భిన్న శైలిల్లో సినిమాలు తీస్తారు కానీ.. ప్రేక్షకులను అలరించడంలో ఎవరికి వారే సాటి. ఇప్పుడు వీళ్లిద్దరి సినిమాలు మూడు వారాల వ్యవధిలో బాక్సాఫీస్ బరిలో నిలిచాయి. అవి రెండూ పాన్ ఇండియా చిత్రాలే కావడం విశేషం.
సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప ఈ నెల 17న విడుదలై ప్రేక్షకుల నుంచి మంచి స్పందనే రాబట్టుకుంటోంది. ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల అవతల చూపిస్తున్న ప్రభావం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇక రాజమౌళి కొత్త చిత్రం ఆర్ఆర్ఆర్ వచ్చే నెల 7న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. దానిపై అంచనాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
ఐతే తమ సినిమాల విడుదలకు ముందు వీళ్లిద్దరూ పూర్తి భిన్నమైన పరిస్థితులను ఎదుర్కోవడం గమనార్హం.
ఆర్ఆర్ఆర్ భారీతనం గురించి అందరికీ తెలిసిందే. ఆ సినిమా ఏడెనిమిది భాషల్లో ఒకేసారి విడుదలవుతోంది. పోస్ట్ ప్రొడక్షన్ విషయంలో చాలా పనే ఉంటుంది. ఇక జక్కన్న సినిమా అంటే ఎఫెక్ట్స్ ఏ స్థాయిలో ఉంటాయో తెలిసిందే. విడుదల ముంగిట ఆయన చాలా ఒత్తిడిని ఎదుర్కంటుంటాడు. రేయింబవళ్లు పని చేస్తుంటాడు. కానీ ఆర్ఆర్ఆర్ విషయంలో మాత్రం జక్కన్న టెన్షన్ ఫ్రీగా కనిపిస్తున్నాడు.
ఈసారి చాలా ముందే ఫస్ట్ కాపీ తీసేశాడో ఏమో కానీ.. చాలా రోజుల ముందే ఫ్రీ అయిపోయాడు. ప్రమోషన్లను ముందుండి నడిపిస్తున్నాడు. ఆయనే లీడ్ తీసుకుంటున్నాడు. ఇంత భారీ చిత్రం విడుదల ముంగిట జక్కన్న ఇంత ప్రశాంతంగా, తాపీగా ప్రమోషన్లు చేసుకుంటుండటం ఆశ్చర్యం కలిగించే విషయమే. సుకుమార్ పరిస్థితి దీనికి పూర్తి భిన్నం. పుష్ప రిలీజ్ ముంగిట ఆయన ఎంత హడావుడి పడ్డారో తెలిసిందే. కొన్ని రోజుల పాటు నిద్రాహారాలు మాని రేయింబవళ్లు పని చేశారు. సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్‌కు కూడా రాలేకపోయారు. ఆ ప్రభావం కొంచెం సినిమా మీద కూడా పడ్డ సంగతి తెలిసిందే.
This post was last modified on December 29, 2021 6:52 am
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…