పూరి జగన్నాథ్‌తో సినిమా చేయడానికి ప్రతి హీరో ఇష్టపడతాడు. ఎందుకంటే అతను హీరోని ఎలివేట్ చేసే విధానమే వేరుగా ఉంటుంది. కేర్‌లెస్‌గా, సరికొత్తగా, కాస్త రొమాంటిక్‌గా, మరికాస్త తిక్కతిక్కగా.. ఇలా ఎవరూ ఊహించని షేడ్స్తో హీరో క్యారెక్టర్‌ని డిజైన్ చేసే విధానం అతనికి మాత్రమే సొంతం. అందుకే ఆయనతో క్రేజీ స్టార్ విజయ్ దేవరకొండ పని చేస్తున్నాడనే వార్త అభిమానుల్లో మామూలు జోష్‌ని నింపలేదు.
‘లైగర్’పై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడానికి కారణం కేవలం వాళ్లిద్దరి కాంబినేషనే అనడంలో సందేహం లేదు. అయితే ఈ సినిమాకి కరోనా అడుగడుగునా అడ్డుపడుతూనే వచ్చింది. అన్ని సినిమాలూ రిలీజ్ డేట్స్ ఫిక్స్ చేసుకుంటున్నా ‘లైగర్’ గురించి చడీ చప్పుడూ లేకపోవడంతో ప్రాజెక్ట్ పరిస్థితి ఏమిటా అని అందరూ కంగారు పడ్డారు.
కానీ సెకెండ్ లాక్‌డౌన్ ఎత్తేయగానే షూట్‌ని రీస్టార్ట్ చేసిన పూరి.. చకచకా పనులు పూర్తి చేయడం మొదలెట్టాడు. ఆగస్ట్ 25న మూవీని రిలీజ్ చేయనున్నట్టు కూడా కన్‌ఫర్మ్ చేసి అభిమానులకు ఊరట కలిగించాడు. ఇప్పుడు న్యూ ఇయర్ సందర్భంగా వరుస అప్‌డేట్స్ విడుదల చేస్తున్నట్టు ప్రకటించి మరింత సంతోషాన్ని కలిగించాడు. రేపటి నుంచి లైగర్ సందడి మొదలవుతోంది.
29న ఉదయం పది గంటల మూడు నిమిషాలకి ఓ బిగ్ అనౌన్స్‌మెంట్ వీడియో రాబోతోంది. 30న ఉదయం పది గంటల మూడు నిమిషాలకి స్టిల్స్ రిలీజ్ కాబోతున్నాయి. నాలుగింటికి స్పెషల్ ఇన్‌స్టా పిల్టర్ రానుంది. ఇక 31న ఫస్ట్ గ్లింప్స్‌ని రిలీజ్ చేయబోతున్నారు. ఇంతకాలం స్లోగా ఉన్న లైగర్ ఒక్కసారిగా ఇలా స్పీడందుకోవడం నిజంగా విశేషమే. వరుసగా మూడు రోజులు మూడు అప్‌డేట్స్ ఇవ్వడమంటే దేవరకొండ ఫాలోవర్లకు పెద్ద పండగే.
Gulte Telugu Telugu Political and Movie News Updates