ఆంధ్రప్రదేశ్‌లో టికెట్ల ధరల సమస్య ఫిలిం ఇండస్ట్రీని మామూలుగా ఇబ్బంది పెట్టట్లేదు. కానీ ఈ విషయంలో చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తున్నా పెద్దగా ఫలితం కనిపించడం లేదు. అయినా సరే.. ప్రభుత్వాన్ని తప్పుబట్టడానికి ధైర్యం చాలక చాలామంది మౌనం వహిస్తున్నారు. ఇలాంటి టైంలో యువ కథానాయకుడు నాని ఏపీ ప్రభుత్వ తీరుపై కాస్త గట్టిగానే విమర్శలు గుప్పించాడు.
ఏపీలో జరుగుతున్నది కరెక్ట్ కాదని, థియేటర్లలో కౌంటర్ల కంటే పక్కనున్న కిరాణా కొట్టుల్లో కౌంటర్ మెరుగ్గా ఉంటోందని వ్యాఖ్యానించాడు. టికెట్ల రేట్లను తగ్గించడం ప్రేక్షకులకు అవమానకరం అని కూడా అతనన్న సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై ఇప్పటికే ఏపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ స్పందించారు. నాని ఎవరో తెలియదంటూ అతడి గాలి తీసే ప్రయత్నం చేశాడు. ఇంకా ఏవో విమర్శలు కూడా చేశారు.
ఇప్పుడు వైసీపీ ఫైర్ బ్రాండ్ అయిన మరో మంత్రి కొడాలి నాని లైన్లోకి వచ్చారు. థియేటర్ల కౌంటర్ కంటే కిరాణా కొట్టుల్లో కౌంటర్ బాగుందంటూ నాని చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. కిరాణా కొట్టుల్లోనే మెరుగైన ఆదాయం ఉందనుకుంటే సినిమా వాళ్లంతా వాటిలోనే పెట్టుబడులు పెట్టాలని, సినిమాల్లో ఇన్వెస్ట్ చేయడం ఎందుకని ఆయన కౌంటర్ వేశారు. సినిమా టికెట్ల రేట్లను తాము తగ్గించలేదని, గతంలో ఉన్న రేట్లే ఉన్నాయని ఆయనన్నారు.
కొన్ని సినిమాల వరకు రేట్లు పెంచుకునేందుకు కోర్టు ద్వారా అనుమతులు తెచ్చుకునేవారని, ఆ పరిస్థితి ఉండకూడదనే తాము జీవో నంబర్ 35ను తీసుకొచ్చామని అన్నారు.కోర్టుల అనుమతితో ప్రేక్షకులను కొందరు దోచుకునే అవకాశం ఇవ్వకూడదన్నదే తమ ప్రభుత్వ ఉద్దేశమని, టికెట్ల ధరలు తగ్గిస్తే ఎగ్జిబిటర్లకు నష్టమని అంటున్నారని, ఎగ్జిబిటర్లను అడ్డం పెట్టుకుని కొందరు గేమ్ ఆడుతున్నారని నాని విమర్శించారు.
This post was last modified on December 28, 2021 7:29 pm
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…