నేచురల్ స్టార్ నాని కెరీర్లో కీలకమైన చిత్రంగా ‘శ్యామ్ సింగ రాయ్’ను చెప్పొచ్చు. ఈ సినిమాకు ముందు నాని చేసిన రెండు చిత్రాలు టక్ జగదీష్, వి అన్ని రకాలుగా నిరాశ పరిచాయి. అవి థియేటర్లలోకి రాకపోవడం నాని అభిమానులకు అస్సలు రుచించలేదు. పైగా వాటికి సరైన టాక్ కూడా రాలేదు. ఈ నేపథ్యంలో తన కొత్త చిత్రాన్ని థియేటర్లలో రిలీజ్ చేయడమే కాక, ప్రేక్షకులను మెప్పించాల్సిన బాధ్యత నానిపై పడింది.
ఈ నేపథ్యంలో ‘శ్యామ్ సింగ రాయ్’పై అందరి దృష్టీ నిలిచింది. నాని కెరీర్లోనే అత్యధిక బడ్జెట్లో తెరకెక్కిన సినిమా ఇది. అనేక అడ్డంకుల్ని అధిగమించి ఈ చిత్రం ఇటీవలే క్రిస్మస్ కానుకగా థియేటర్లలోకి దిగింది. ఈ సినిమాకు ఎలాంటి టాక్ వస్తుందో అని అంతా ఉత్కంఠగా ఎదురు చూశారు. చిత్ర బృందం టెన్షన్ తీరిపోయేలా పాజిటివ్ టాకే వచ్చింది. అలాగే ఈ సినిమాకు ఓపెనింగ్స్ కూడా ఆశాజనకంగానే ఉన్నాయి.
నాని బాక్సాఫీస్ స్టామినాను ‘శ్యామ్ సింగ రాయ్’ రుజువు చేసింది. మూడు రోజుల తొలి వీకెండ్లో ఈ చిత్రం వరల్డ్ వైడ్ రూ.24 కోట్ల దాకా గ్రాస్, రూ.14 కోట్ల మేర షేర్ రాబట్టింది. నైజాంలో ఈ సినిమా బాగా పెర్ఫామ్ చేసింది. ఇక్కడ రూ.8.5 కోట్ల గ్రాస్, దాదాపు 5 కోట్ల షేర్ వచ్చిందీ చిత్రానికి. సీడెడ్లో కోటిన్నర దాకా షేర్ కలెక్ట్ చేసింది నాని సినిమా. ఆంధ్రాలోని మిగతా ఏరియాలన్నీ కలిపి రూ.4 కోట్ల పైచిలుకు షేర్ వచ్చింది.
ఓవరాల్‌గా ఏపీ, తెలంగాణ కలిపి పదిన్నర కోట్ల దాకా షేర్, రూ.16 కోట్లకు పైగా షేర్ కలెక్ట్ అయింది. యుఎస్‌లో ఈ చిత్రం వీకెండ్లో హాఫ్ మిలియన్ డాలర్ల మార్కును టచ్ చేసింది. ఓవరాల్‌గా సినిమా తొలి వీకెండ్లో మంచి వసూళ్లే రాబట్టింది. ఈ సినిమా థియేట్రికల్ హక్కులను రూ.20 కోట్లకు అమ్మినట్లు అంచనా. వీక్ డేస్‌లో కొంచెం వీక్ అయినప్పటికీ.. వీకెండ్లో మళ్లీ పుంజుకుంటుందని అంచనా. కాబట్టి సినిమా బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్సులున్నట్లే.
This post was last modified on December 28, 2021 4:31 pm
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…