తెలుగు బిగ్ బాస్ ఐదో సీజన్లో అడుగు పెట్టినప్పటి నుంచి టైటిల్ ఫేవరెట్లలో ఒకడిగా ఉన్నాడు షన్ను. యూట్యూబ్‌లో షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్‌లతో మాంచి ఫాలోయింగ్, పాపులారిటీ సంపాదించుకుని ఈ షోలో అడుగు పెట్టిన అతను.. కచ్చితంగా టైటిల్ సాధిస్తాడని చాలామంది నమ్మారు. ఐతే షో మధ్యలో సిరితో అతడి బంధం పట్ల జనాలకు నెగెటివ్ ఫీలింగ్స్ కలగడం, ఒక దశ దాటాక వీరి రిలేషన్ మరీ శ్రుతి మించిపోవడంతో అతను ట్రాక్ తప్పాడు.
టైటిల్ గెలవాల్సిన వాడు చివర్లో నెగెటివిటీ పెంచుకుని రన్నరప్‌కు పరిమితం అయ్యాడు. షన్ను, సిరి రిలేషన్ గురించి ఎంత చర్చ జరిగిందో తెలిసిందే. నిజజీవితంలో వీళ్లిద్దరూ ఆల్రెడీ ఎంగేడ్జ్ అన్న సంగతి తెలిసిందే. షన్నుకు, మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్ కమ్ యూట్యూబ్ స్టార్ దీప్తికి మధ్య బంధం గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు.
షోలో జరిగిన దాని పట్ల బయటి జనాలు ఎన్ని అనుకున్నా.. దీప్తి షన్ను విషయంలో ఎలా స్పందిస్తుందనే విషయంలో అందరూ ఉత్కంఠకు గురయ్యారు. ఇటీవల ఆమె సోషల్ మీడియా పోస్టులు చూస్తే షన్నుతో బ్రేకప్ అయిందేమో అన్న సందేహాలు కలిగాయి. ఈ విషయమై తాజాగా షన్ను స్పందించాడు. అభిమానులతో లైవ్ సందర్భంగా చాలామంది షన్నును దీప్తితో బ్రేకప్ గురించే అడిగారు. దానికతను బదులిస్తూ.. దీప్తి తనను బ్లాక్ చేసిందని వెల్లడించాడు.
బిగ్ బాస్ నుంచి బయటికి వచ్చినప్పటి నుంచి దీప్తి తనతో మాట్లాడట్లేదని వెల్లడించాడు. దీప్తికి కోపం వచ్చినా.. అలిగినా ఇలాగే బ్లాక్ చేస్తుందని.. త్వరలోనే హైద్రాబాద్ వెళ్లి తనను కలుస్తానని చెప్పుకొచ్చాడు షన్ను. దీప్తి తన వల్ల చాలా నెగిటివిటిని ఫేస్ చేసిందని.. అయినా తన కోసం నిలబడిందని.. తప్పకుండా వెళ్లి తనతో మాట్లాడతానని.. తనతో బ్రేకప్ మాత్రం జరగదని.. తన చేతి మీద ఉన్న పచ్చబొట్టు పోయేంత వరకు దీప్తిని వదలనని చెప్పాడు షణ్ముఖ్.
This post was last modified on December 27, 2021 12:48 pm
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రాభివృద్ధి జెట్ స్పీడ్ లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఓ వైపు అమరావతి…
భారత్, పాకిస్థాన్ మరోసారి ఫైనల్‌లో తలపడబోతున్నాయి. ఆసియా క్రీడల్లో పురుషుల క్రికెట్ గోల్డ్ మెడల్ కోసం శనివారం రెండు జట్లు…
అమెరికా వీసా వచ్చేసింది కదా.. ఇక దాని గడువు ముగిసే వరకు ఎలాంటి ఇబ్బంది ఉండదని అనుకుంటే పొరపాటే. వీసా…
కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ).. తాజాగా మరో ఉద్యమానికి తెరదీసింది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్.. జ్ఞానేష్ కుమార్ రాజీనామాకు…
హీరో అయ్యేందుకు ఏళ్ల పాటు శ్రమించేవారు కొందరైతే.. తాము చేసిన పనుల కారణంగా చూపిన ధైర్య సాహసాల కారణంగా రాత్రికి…
కంటెంట్ కన్నా ముఖ్యం ఏది కాదనేది ఎప్పటికప్పుడు బాక్సాఫీస్ నిరూపిస్తునే ఉంటుంది. కాకపోతే కొందరు దర్శకులు తెలుసుకుంటారు, మరికొందరు తెలుసుకునేలోపే…