ప్రతి అంశం సున్నితంగా మారిపోయిన ఇప్పటి రోజుల్లో ప్రతిది ఆచితూచి అన్నట్లు వ్యవహరించాల్సి ఉంది. అయినప్పటికి తరచూ ఏదో ఒక వివాదం తెర మీదకు వస్తోంది. తాజాగా ఒకప్పటి అడల్ట్ స్టార్ కమ్ బాలీవుడ్ నటి సన్నీ లియోన్ తాజాగా చేసిన వీడియో ఒకటి పెను వివాదంగా మారటం తెలిసిందే. హిందువుల మనోభావాల్ని దారుణంగా దెబ్బ తీసేలా ఈ పాట ఉందన్న వాదన అంతకంతకూ ఎక్కువ అవుతోంది. ‘మధుబన్ మే రాధిక నాచే’ పేరుతో విడుదలైన ఈ హందీ వీడియో సాంగ్ పై పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తం కావటంతో పాటు.. హిందువుల మనోభావాల్ని దెబ్బ తీసేలా చేయాలన్న ఉద్దేశంతోనే ఈ పాటను విడుదల చేశారని మండిపడుతున్నారు.
డిసెంబరు 22న విడుదలైన ఈ పాటపై ఉత్తరప్రదేశ్ కు చెందిన కొందరు ఆర్బకులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై తాజాగా మధ్యప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి.. బీజేపీనేత సరోత్తమ మిశ్రా స్పందించారు. మూడు రోజుల వ్యవధిలో ఈ పాటను తీసేయకుంటే.. తాము చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. ఈ పాటను పాడిన సింగర్స్ ను.. డ్యాన్స్ చేసిన సన్నీలియోన్ తో పాటు.. పాటను ప్రొడ్యూస్ చేసిన సంస్థకు తాజాగా హెచ్చరికల్ని ఆయన చేశారు.
ఇంతకీ ఈ పాట బ్యాక్ గ్రౌండ్ ఏమిటి? ఇదెందుకు వివాదమైంది? అన్న విషయంలోకి వెళితే.. 1960లో వచ్చిన కోహినూర్ చిత్రంలో ‘మధుబన్ మే రాధిక నాచ్ రే’ పాటలోని పల్లవిని ఈ పాట పోలిఉంటుంది. అప్పట్లో ఆ పాటను ప్రముఖ గాయకుడు మహ్మద్ రఫీ పాడగా.. దిలీప్ కుమార్ యాక్ట్ చేశారు. తాజాగా ఇదే పాటను రీమేక్ లో షరీబ్.. తోషిలు పాడగా.. సన్నీ లియోన్ ఆడారు. ఈ వివాదంలో ఈ ముగ్గురు ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అంతేకాదు.. మూడు రోజుల వ్యవధిలో ఈ వీడియోను తొలగించకుంటే చర్యలు తీసుకుంటామని తేల్చి చెప్పారు.
మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ వార్నింగ్ నేపథ్యంలో ఈ పాటను విడుదల చేసిన ‘సరిగమప’ మ్యూజిక్ సంస్థ.. పాటను మార్చాలని నిర్ణయించింది.
ప్రజల మనోభావాల్ని పరిగణలోకి తీసుకొని.. ఈ నిర్ణయాన్ని తీసుకున్నామన్నారు. మార్పు చేసిన లిరిక్స్ తో పాటు.. పాట పేరును కూడా మారుస్తామన్నారు. మూడు రోజుల్లో అన్ని వేదికల్లోనూ మార్పు చేసిన పాట అందుబాటులోకి వస్తుందన్నారు. ఇక.. వార్నింగ్ ఇచ్చిన నరోత్తమ విషయానికి వస్తే.. గతంలోనూ ఆయనో జ్యువెలరీ సంస్థకు హెచ్చరిక చేశారు. మంగళసూత్రాన్ని ఉద్దేశిస్తూ ఈ ప్రకటనను రూపొందించారు. ఆయన హెచ్చరిక అనంతరం ఆ యాడ్ ను ఉపసంహరించుకున్నారు. ఏమైనా.. పాటలు కానీ.. ప్రకటనలు కానీ రూపొందించే వేళలోనే అందరి మనోభావాల గురించి ఆలోచించటం పెద్ద సవాలుగా మారుతుందని చెప్పక తప్పదు.
This post was last modified on December 27, 2021 11:39 am
తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై జరుగుతున్న విచారణలో రాష్ట్ర జలవనరుల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వి.ప్రకాశ్ కీలక సమాచారాన్ని…
బతుకుదెరువు కోసం ఎక్కడెక్కడికో వెళ్లిన వారు తమ ఇళ్లకు వెళుతున్నారు. ఇంటికొచ్చిన వారు బతుకుదెరువు కోసం కార్యస్థానాలకు బయలుదేరారు. అందరికీ…
బాలీవుడ్లో ఒకప్పుడు నిలకడగా సూపర్ హిట్ సినిమాలు అందిస్తూ వైభవం చూసిన నటుడు అక్షయ్ కుమార్. ఖాన్ త్రయం భారీ…
ఏపీలోని కూటమి సర్కారు బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. తిరుపతిలో జరిగిన తొక్కిసలాటపై న్యాయ విచారణకు ప్రభుత్వం ఆదేశాలు జారీ…
దేశంలో ఇంకా అరాచకాలు జరుగుతూనే ఉన్నాయి. నానాటికీ అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీతో పోటీ పడి మరీ పరుగులు పెడుతుంటే… దేశ…
రామ్ గోపాల్ వర్మలో ఎప్పుడూ లేని పశ్చాత్తాప భావన చూస్తున్నాం ఇప్పుడు. ఒకప్పుడు రంగీలా, సత్య లాంటి క్లాసిక్స్ తీసిన…