బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ అని తేడా లేదు. ఇప్పుడందరి దృష్టీ ఓటీటీల మీదే ఉంది. థియేటర్లు ఎప్పుడు తెరుచుకుంటాయో తెలియదు. తెరుచుకున్నా ఆక్యుపెన్సీ చాలా కష్టంగా ఉంది. ఇప్పటికే మూడు నెలలు గడిచిపోయాయి. ఒకప్పట్లా థియేటర్లు నడవడానికి ఎంత సమయం పడుతుందో తెలియదు. ఈ నేపథ్యంలో చిన్న, మీడియం రేంజి సినిమాల దృష్టి ఓటీటీల మీదే పడింది. లాభాలు తగ్గించుకుని అయినా నేరుగా డిజిటల్ రిలీజ్‌కు ఒప్పేసుకుంటున్నారు. ఈ విషయంలో టాలీవుడ్ కొంచెం వెనుకంజ వేస్తోంది కానీ.. మిగతా ఇండస్ట్రీలు చురుగ్గానే ఉన్నాయి. హిందీలో వరుసగా సినిమాలు ఓటీటీల్లోకి దూకేయబోతున్నాయి. ఇంకో మూడు రోజుల్లోనే అమితాబ్ బచ్చన్, ఆయుష్మాన్ ఖురానాల ‘గులాబో సితాబో’ అమేజాన్ ప్రైమ్‌లో రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే నవాజుద్దీన్ సిద్ధిఖి సినిమా ‘గూమ్ ఖేతు’ కూడా ఇలాగే రిలీజైన సంగతీ తెలిసిందే.
విద్యాబాలన్ మూవీ ‘శకుంతలా దేవి’ కూడా త్వరలోనే ప్రైమ్‌లోకి రాబోతోంది. ఇంతలో మరో ఆసక్తికర మూవీ డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ జాబితాలో చేరింది. అదే.. గుంజన్ సక్సేనా. ఇది శ్రీదేవి పెద్ద కూతురు జాన్వి కపూర్ ప్రధాన పాత్ర పోషించిన చిత్రం. 2018లో వచ్చిన లవ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘ధఢక్’తో కథానాయికగా పరిచయమైన జాన్వి.. రెండో సినిమాకే ఓ ఛాలెంజింగ్ రోల్ ఎంచుకుంది. ఆమె కార్గిల్ యుద్ధంలో మహిళా పైలట్‌గా వీరోచిత పాత్ర పోషించిన గుంజన్ సక్సేనా బయోపిక్ లో నటిస్తుంది. ‘గుంజన్ సక్సేనా-ది కార్గిల్ గర్ల్’ పేరుతో తెరకెక్కిన ఈ చిత్రాన్ని శరణ్ శర్మ రూపొందించాడు. కరణ్ జోహార్ సంస్థ ‘ధర్మ ప్రొడక్షన్స్’తో కలిసి జీ స్టూడియోస్ ఈ సినిమాను నిర్మించింది. ఈ చిత్రం డైరెక్ట్‌గా నెట్ ఫ్లిక్స్‌లో అందుబాటులోకి రానుంది. ఈ మేరకు నిర్మాతలు అధికారిక ప్రకటన కూడా ఇచ్చేశారు. మరి శ్రీదేవి కూతురి సినిమాకు ఆన్‌లైన్లో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.
This post was last modified on June 10, 2020 12:14 am
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…
సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…
ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…
ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…