టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య మొదటినుంచి కూడా సరికొత్త కథలను ఎన్నుకుంటూ కెరీర్ పరంగా దూసుకుపోతున్నారు. ఓ పక్క హీరోగా సినిమాలు చేస్తూనే అప్పుడప్పుడు వేరే సినిమాల్లో స్పెషల్ రోల్స్ చేస్తుంటాడు. ‘ఓ బేబీ’ సినిమా ఇదే కోవలోకి వస్తుంది. అందులో సమంత మెయిన్ లీడ్ కాగా.. నాగశౌర్య ఆమెని ప్రేమించే పాత్రలో కనిపిస్తాడు. ఇప్పుడు అలాంటి ఆఫరే శౌర్యకి మరొకటి వచ్చినట్లు తెలుస్తోంది. స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ కి జంటగా కనిపించే రోల్ అని సమాచారం.
మెగాస్టార్ చిరంజీవి, మెహర్ రమేష్ కాంబినేషన్ లో ‘భోళాశంకర్’ అనే సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో చిరుకి చెల్లెలి పాత్రలో కీర్తి సురేష్ నటిస్తోంది. ఆమెకి జోడీగా నాగశౌర్యను తీసుకోవాలని భావిస్తున్నారు. రీసెంట్ గానే అతడితో సంప్రదింపులు జరిపారు. కానీ ఇప్పటివరకు ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది.
క్రేజీ ప్రాజెక్ట్ కాబట్టి శౌర్య నో చెప్పే అవకాశాలు లేవనే చెప్పాలి. చిరు సినిమా.. కీర్తి సురేష్ కి జోడీగా అంటే కచ్చితంగా పాత్రకు మంచి ప్రాముఖ్యత ఉంటుంది. ఒకట్రెండు రోజుల్లో ఈ విషయంపై క్లారిటీ రానుంది. ఈ ఏడాది రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాగశౌర్య.. ప్రస్తుతం మూడు సినిమాలను లైన్ లో పెట్టారు. వీటితో పాటు ‘సినిమా బండి’ డైరెక్టర్ తో మరో సినిమా ఓకే చేసినట్లు సమాచారం. మొత్తానికి ఈ యంగ్ హీరో వచ్చే ఏడాది మొత్తం బిజీ బిజీగా గడపనున్నారన్నమాట!
This post was last modified on December 26, 2021 6:33 pm
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…