Movie News

దూసుకుపోతోన్న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ తెలుగు ఒరిజినల్ సిరీస్ పరంపర!

డిస్నీప్లస్ హాట్‌స్టార్ లో కొత్త వెబ్ సిరీస్ ‘పరంపర’ డిసెంబర్ 24 రిలీజ్ అయ్యింది. అధికారం, పగ ప్రతీకారాల నేపథ్యంలో ఈ సిరీస్ చిత్రీకరించారు. ఇందులో జగపతి బాబు, శరత్‌కుమార్, నవీన్ చంద్ర, ఆకాంక్ష సింగ్ కీలక పాత్రల్లో నటించారు. ఎల్.కృష్ణ విజయ్, అరిగెల విశ్వనాథ్‌ల దర్శకత్వంలో ఈ వెబ్ సిరీస్ తెరకెక్కింది. బాహుబలి నిర్మాతలైన శోభు యార్లగడ్డ, ఆర్కా మీడియా ప్రొడక్షన్స్ అధినేత ప్రసాద్ దేవినేని సంయుక్తంగా ఈ సిరీస్‌ను నిర్మించారు.

జగపతి బాబు మాట్లాడుతూ.. ‘అద్భుతమైన నటీనటులంతా ఒకే చోటకు వస్తే అద్భుతమైన ప్రొడక్ట్ బయటకు వస్తుంది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ అలా అందరినీ ఒకే చోటకు తీసుకొస్తుంది. ప్రెష్ టాలెంట్, క్రియేటివ్ టాలెంట్‌ను ప్రోత్సహిస్తోంది. ఈ ప్రాజెక్ట్‌లో భాగస్వామిని అయినందుకు ఎంతో సంతోషంగా ఉంది. ఇక మున్ముందు తెలుగులో చెప్పే కథల స్థాయి పెరగనుంది’ అని అన్నారు.

“మూడు జెనరేషన్స్ కి సంబంధించిన కథ అని, పెర్సనల్ ఎక్స్ పీరియన్స్ తో రాశానని” రైటర్ హరి ఏలేటి ఎమోషనల్ గా చెప్పారు. ‘పరంపర’ అనేది వారసత్వానికి, అర్హతకి మధ్య జరిగే ఘర్షణ. ఫ్యామిలీ, యాక్షన్, లవ్, ఎమోషన్స్ ఇలా అన్ని ఎలిమెంట్స్ ఈ సిరీస్ లో ఉంటాయి. ఫస్ట్ సీజన్ ప్రేక్షకులకు గ్యారంటీ గా నచ్చుతుంది” అంటూ చెప్పుకొచ్చారు హీరో నవీన్ చంద్ర.

Content Produced by: Indian Clicks, LLC

This post was last modified on December 25, 2021 10:35 am

Share

Recent Posts

రాకా… అలా ఫిక్సయిపోవచ్చా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…

33 minutes ago

ఆదర్శ నిర్ణయాలు మంచి ఫలితాలు ఇవ్వాలి

ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…

2 hours ago

హైదరాబాద్ తగలబెడతానంటోన్న దానం

ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…

2 hours ago

జగన్ పిలిచినా సాయిరెడ్డి వెళ్ళరు

ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…

2 hours ago

సిగ్మా తీర్చాల్సిన బాకీ ఇద్దరిదే

దసరా నెల ప్రారంభంలో విడుదలవుతున్న మొదటి వారం సినిమాల్లో సిగ్మా మీద మంచి అంచనాలే నెలకొన్నాయి. తమిళనాడు సిఎం కొడుకు…

2 hours ago

అభయం ఇస్తున్న సాయి అభ్యంక్కర్

దక్షిణాది సంగీత దర్శకుల్లో అత్యధిక డిమాండ్ ఎంజాయ్ చేస్తున్న వాళ్లలో మొదట వినిపించే పేరు అనిరుధ్ రవిచందర్. బ్యాక్ గ్రౌండ్…

4 hours ago