ఈ ఏడాది తెలుగులో విడుదలైన బిగ్గెస్ట్ మూవీ అంటే.. పుష్పనే. పాన్ ఇండియా లెవెల్లో రిలీజైన ఈ చిత్ర థియేట్రికల్ హక్కులను దాదాపు రూ.150 కోట్లకు అమ్మారు. గత వారం విడుదలైన ఈ చిత్రానికి డివైడ్ టాక్ వచ్చింది. అయినప్పటికీ ఈ సినిమా తొలి వారాంతంలో వసూళ్ల మోత మోగించింది. తొలి మూడు రోజుల్లో రికార్డు స్థాయి వసూళ్లు రాబట్టింది. ఆ తర్వాత సినిమా వసూళ్లు డ్రాప్ అయ్యాయి. పుష్ప అప్పుడే రెండో వారంలోకి కూడా అడుగు పెట్టేసింది.
ఈ నేపథ్యంలో తొలి వారం వసూళ్లు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. పుష్ప ఫస్ట్ వీక్ వరల్డ్ వైడ్ 100 కోట్లకు పైగా షేర్ రాబట్టడం విశేషం. ఏడు రోజుల్లో అన్ని వెర్షన్లూ కలిపి దాదాపు రూ.110 కోట్ల దాకా షేర్ రాబట్టాయి. అందులో మేజర్ షేర్ తెలుగు వెర్షన్‌దే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఈ చిత్రం రూ.67 కోట్ల దాకా షేర్ కలెక్ట్ చేసింది. ఇందులో నైజాందే మేజర్ వాటా. ఇక్కడ దాదాపు రూ.32 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది పుష్ప.
ఇంకో నాలుగు కోట్లొస్తే బ్రేక్ ఈవెన్ అవుతుంది. ఈ వీకెండ్ అయ్యేసరికి ఆ మార్కును అందుకోవచ్చు. సీడెడ్లో పుష్ప బిజినెస్ రూ.18 కోట్లు కాగా.. ఇప్పటికి రూ.11 కోట్ల షేర్ వచ్చింది. అక్కడ అతి కష్టం మీద బ్రేక్ ఈవెన్‌కు చేరువగా వెళ్లొచ్చు. ఆంధ్రాల్లో రూ.48 కోట్లకు బిజినెస్ జరిగితే ఇప్పటిదాకా వచ్చిన షేర్ రూ.24 కోట్ల లోపే. ఆంధ్రాలో భారీ నష్టాలు తప్పేలా లేవు.
పుష్ప తమిళ వెర్షన్ రూ.6 కోట్లు, మలయాళ వెర్షన్ రూ.4 కోట్లు షేర్ రాబట్టి ఆల్రెడీ బ్రేక్ ఈవెన్ అయిపోయాయి. రెండో వారంలో వచ్చేదంతా లాభమే. హిందీ వెర్షన్ దాదాపు రూ.14 కోట్ల షేర్ రాబట్టి ఆల్రెడీ 3 కోట్ల లాభంలో ఉంది. ఓవర్సీస్ రైట్స్ రూ.13 కోట్లకు అమ్మగా.. ఇప్పటికే ఈ చిత్రం 2 మిలియన్ మార్కును దాటేసి బ్రేక్ ఈవెన్ అయింది. ఓవరాల్‌గా తొలి వారం షేర్ రూ.110 కోట్లకు చేరువగా.. గ్రాస్ కలెక్షన్లు రూ.200 కోట్ల మార్కుకు దగ్గరగా ఉన్నాయి. కానీ ఓవరాల్‌గా ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఇంకో రూ.40 కోట్ల షేర్ రాబట్టాలి.
This post was last modified on December 25, 2021 8:06 am
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…
సంధ్య థియేటర్ విషాదం సినిమాని మించిన మలుపులు తిరుగుతూ విపరీత రాజకీయ రంగు పులుముకుని ఎక్కడ చూసినా దీని గురించే…
పవన్ కళ్యాణ్ అభిమానులకు ఓజి తప్ప ఇంకే మాట వినిపించేలా లేదు. సినిమాకు సంబంధించిన ఎవరైనా ఎక్కడైనా కనిపించినా వెళ్లినా…