బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ సినిమాల్లో ఎంట్రీ ఇస్తున్నాడనే విషయంలో హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్ ను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో షారుఖ్ ఫ్యామిలీ చాలా ఇబ్బందులను ఎదుర్కొంది. జైల్లో ఉన్న కొడుకుని విడిపించుకోవడానికి షారుఖ్ చేయని ప్రయత్నం లేదు.
ఆర్యన్ ను కావాలనే ఈ కేసులో ఇరికించారనే మాటలు కూడా వినిపించాయి. ఫైనల్ గా ఆర్యన్ జైలు నుంచి బయటపడ్డాడు.
ఇప్పుడు తమ కుమారుడిని ఇండస్ట్రీకి పరిచయం చేయాలని ఫిక్స్ అయ్యారు షారుఖ్-గౌరీఖాన్ దంపతులు. కానీ హీరోగా మాత్రం కాదట. కొన్నాళ్లుగా ఆర్యన్ ఖాన్ ప్రముఖ దర్శకుల దగ్గర ఫిల్మ్ మేకింగ్ క్లాసులు నేర్చుకుంటున్నాడు. సెట్స్ లో ఒక సన్నివేశాన్ని ఎలా చిత్రీకరించాలనే విషయాలను దగ్గరుండి పరిశీలిస్తున్నాడట.
అలానే ఆదిత్య చోప్రా, కరణ్ జోహార్ ప్రొడక్షన్ హౌస్ లో ఆర్యన్ ఖాన్ పనిచేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఈ మధ్యనే ఆర్యన్ ఖాన్.. ఆదిత్య చోప్రాకు సంబంధించిన వైఆర్ఎఫ్ స్టూడియోను విజిట్ చేయడంతో ఈ ఊహాగానాలు మరింత బలపడ్డాయి. అలానే షారుఖ్ నటిస్తోన్న ‘పఠాన్’ సినిమాకి ఆర్యన్ ఖాన్ పనిచేస్తున్నాడేమో అనే ఊహాగానాలు కూడా బయటకు వచ్చాయి.
దీంతో పాటు కరణ్ జోహార్ నిర్మాణ సంస్థలో తెరకెక్కుతోన్న సినిమాలకు సైతం అసిస్టెంట్ డైరెక్టర్ గా వ్యవహరించనున్నట్లు సమాచారం. దీన్ని బట్టి చూస్తుంటే ఆర్యన్ ఖాన్ త్వరలోనే అసిస్టెంట్ డైరెక్టర్ గా బాలీవుడ్ కి పరిచయం అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. సాధారణంగా హీరో పిల్లలు హీరోలుగానే సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తుంటారు. కానీ ఆర్యన్ ఖాన్ మాత్రం తెరవెనుకే ఉండాలనుకుంటున్నాడు. మరి డైరెక్టర్ గా ఆర్యన్ ఖాన్ ఇండస్ట్రీలో నిలదొక్కుకుంటాడో లేదో చూడాలి!
This post was last modified on December 24, 2021 2:00 pm
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…