‘ఆర్ఆర్ఆర్’ సినిమాను దేశవ్యాప్తంగా ఏ రేంజిలో ప్రమోట్ చేస్తున్నారో తెలిసిందే. రెండు నెలల కిందట రిలీజ్ డేట్ ప్రకటించిన దగ్గర్నుంచే ప్రమోషన్ జోరు మొదలైంది కానీ.. ఈ నెల రెండో వారంలో ట్రైలర్ లాంచ్ చేశాక హంగామా మరో స్థాయికి వెళ్లింది. ఇక అప్పట్నుంచి ఆపకుండా ప్రమోషన్లు చేస్తున్నారు. ఇటీవలే ముంబయిలో భారీ స్థాయిలో ఒక ప్రమోషనల్ ఈవెంట్ చేయడమే కాక ప్రొ కబడ్డీ కొత్త సీజన్ లాంచింగ్ వేడుకల్లోనూ ‘ఆర్ఆర్ఆర్’ టీం హడావుడి చేసిన సంగతి తెలిసిందే.
ఇక ఇప్పట్నుంచి ‘ఆర్ఆర్ఆర్’ టీం ఏ ఒక్క రోజునూ ఖాళీగా వదిలేలా లేదు. ప్రతి రోజూ ఆఫ్ లైన్లోనో ఆన్ లైన్లోనో ఏదో ఒక ప్రమోషన్ ఉండేలా చూసుకుంటోంది. తాజాగా ఈ సినిమా నుంచి కొమరం భీమ్ థీమ్ సాంగ్ లాంచ్‌కు రంగం సిద్ధమైంది. ఐతే ఇప్పుడు రిలీజ్ చేయబోయే పాట సినిమాలోని విజువల్స్‌తో ఉండదు.
దోస్తీ సాంగ్ తరహాలోనే దీనికి కూడా ప్రమోషనల్ సాంగ్ రెడీ చేశారు.కొమరం భీముడో కొమరం భీముడో అంటూ సాగే ఈ పాటను కీరవాణి తనయుడు కాలభైరవ ఆలపించడం విశేషం. లెజెండరీ లిరిసిస్ట్ సుద్దాల అశోక్ తేజ ఈ పాట రాశారు. ఈ సాంగ్ ప్రోమోను తాజాగా రిలీజ్ చేశారు. చాలా రిచ్‌గానే ప్రోమో సాంగ్‌ను తీర్చిదిద్దనట్లు కనిపిస్తోంది. దీని కోసం చెప్పుకోదగ్గ స్థాయిలోనే బడ్జెట్ పెట్టినట్లు, ఒక కాన్సెప్ట్ ప్రకారం దీన్ని తీర్చిదిద్దారని అర్థమవుతోంది.
మామూలుగా సినిమాలో పాటలకు ఎంత హంగామా ఉంటుందో.. ప్రమోషనల్ సాంగ్స్‌కే అంత చేస్తోంది ‘ఆర్ఆర్ఆర్’ టీం. ఇలాంటివి రాజమౌళికే చెల్లు అని చర్చించుకుంటున్నారు జనాలు. ఈ పాటను చిత్రీకరించడానికి వేరే ఫొటోగ్రాఫర్‌ను పెట్టుకోవడం విశేషం. అతనేమీ ఆషామాషీ టెక్నీషియన్ కాదు. ఇండియాలో టాప్ సినిమాటోగ్రాఫర్స్‌లో ఒకడైన రిషి పంజాబి ఈ చిత్రానికి పని చేశాడు. ఈ పాట కాన్సెప్ట్, విజువలైజేషన్ అంతా కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షితే చూసుకున్నాడు. వినడానికి, చూడ్డానికి ఈ పాట చాలా బాగుండేట్లే కనిపిస్తోంది.
This post was last modified on December 23, 2021 3:26 pm
తండేల్ ప్రమోషన్లలో భాగంగా అల్లు అరవింద్ ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మగధీర తన మేనల్లుడు రామ్ చరణ్ కు ఎలాగైనా…
అమెరికా ప్రభుత్వం అక్రమంగా ఉన్న 104 మంది భారతీయులను దేశం నుంచి బహిష్కరించిన విషయం తెలిసిందే. పంజాబ్‌లోని అమృత్‌సర్‌కు ప్రత్యేక…
ఆస్ట్రేలియా జట్టు ఈసారి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో స్ట్రాంగ్ టీమ్ గా రాబోతోంది అనుకుంటున్న టైమ్ లో ఊహించని పరిణామాలు…
ఏప్రిల్ 10 ది రాజా సాబ్ రావడం లేదనేది అందరికీ తెలిసిన విషయమే అయినా టీమ్ ఇప్పటిదాకా ఆ విషయాన్ని…
ఇరవై రెండు సంవత్సరాల క్రితం రిలీజైన జానీ ఇప్పటి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఒక కల్ట్ లా ఫీలవుతారేమో కానీ…
ఆరాధన సినిమాలో పులిరాజు పాత్ర పోషించిన చిరంజీవి ఎక్స్ ప్రెషన్ ని తన ఆఫీస్ లో ఫోటో ఫ్రేమ్ గా…