ఈ ఏడాది ఆరంభానికి ముందు నందమూరి బాలకృష్ణ పరిస్థితి ఏ రకంగానూ బాగా లేదు. 2019 ఆయనకు దారుణమైన అనుభవాలను మిగిల్చింది. ఏదో అనుకుని తన తండ్రి బయోపిక్ తీస్తే రెండు భాగాలూ తీవ్ర నిరాశను మిగిల్చాయి. ఆ తర్వాత రూలర్ అనే సినిమా చేస్తే అదీ పెద్ద డిజాస్టర్ అయింది. ఇక రాజకీయంగా చూస్తే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోర పరాభవం బాలయ్య డీలా పడేలా చేసింది.
2020లో బాలయ్య బౌన్స్ బ్యాక్ అవుతాడనుకుంటే.. కరోనా కారణంగా ఆయన సినిమా ఏదీ విడుదల కాలేదు. 2021లో పరిస్థితులు మెరుగవడానికి చాలా టైం పట్టింది. అఖండ రిలీజ్ మీద ఎడతెగని సస్పెన్స్ నెలకొంది. అసలీ ఏడాది ఈ చిత్రం విడుదలవుతుందా లేదా అన్న సందేహాలు కూడా కలిగాయి. చివరికి డిసెంబరు 2న ఈ చిత్రం థియేటర్లలోకి దిగింది.
ఐతే ఆలస్యం అయితే అయింది కానీ.. ఈ చిత్రానికి అనూహ్యమైన ప్రి రిలీజ్ హైప్ వచ్చింది. ఇక బాక్సాఫీస్ దగ్గర అఖండ సంచలనాల గురించి ఎంత చెప్పినా తక్కువే. బాలయ్య కెరీర్లో ఈ దశలో థియేటర్లలో ఇలాంటి సంబరాలు తీసుకొస్తాడని.. ఇలా వసూళ్ల మోత మోగిస్తాడని ఎవ్వరూ అనుకోలేదు. అఖండ బాలయ్య కెరీర్లోనే ఒక మైలురాయిలా నిలిచిపోయింది. ఆయన కెరీర్‌కు కొత్త ఊపును తీసుకొచ్చింది. ఈ రకంగా బాలయ్యకు 2021 మరపు రాని ఏడాదే. బాలయ్యకు ఇంకో రకంగా కూడా 2021 చాలా స్పెషల్. ఎన్నడూ లేని విధంగా, ఊహించని రీతిలో ఆయన టీవీ హోస్ట్ అవతారం ఎత్తారు.
ఆహా ఓటీటీ కోసం అన్ స్టాపబుల్ షో చేశారు. ఈ షో గురించి ప్రకటన వచ్చినపుడు బాలయ్యతో టాక్ షోనా అని చాలామంది అనేక సందేహాలు వ్యక్తం చేశారు. కానీ అందరినీ ఆశ్చర్యపరిచే రీతిలో ఈ కొత్త అవతారంలో బాలయ్య సూపర్ సక్సెస్ అయ్యారు. బాలయ్యను మామూలుగ కామెడీ చేసేవాళ్లు కూడా ఈ షోలో ఆయన హోస్టింగ్ స్కిల్స్ చూసి ఔరా అంటున్నారు. బాలయ్య షో కోసమే పెద్ద ఎత్తున ఆహా సబ్‌స్క్రిప్షన్లు తీసుకునేంత క్రేజ్ వచ్చింది. మొత్తంగా చూస్తే టాలీవుడ్ వరకు 2021 బాలయ్యదే అనడంలో మరో మాట లేదు.
This post was last modified on December 23, 2021 12:17 pm
సోషల్ మీడియా ప్రపంచంలో నెగటివిటీ ఎంతగా పెరిగిపోయిందంటే గాలి కన్నా వేగంగా ఇదే ప్రయాణిస్తోంది. కొందరి ఆలోచనలను, వ్యక్తిత్వాలను తీవ్రంగా…
పన్నెండు సంవత్సరాలు ఒక సినిమా విడుదల కాకుండా ల్యాబ్ లో మగ్గితే దాని మీద ఎవరికీ పెద్దగా ఆశలు ఉండవు.…
ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్‌తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…