సంక్రాంతి కానుకగా ‘రాధేశ్యామ్’ రిలీజ్ కాబోతోంది. రేపు ట్రైలర్ కూడా విడుదల కానుంది. ఇంతలో ఓ టీజర్‌తో ఫ్యాన్స్‌ని సర్‌ప్రైజ్ చేసింది టీమ్. రిలీజ్ దగ్గర పడుతూ ఉండటంతో ప్రమోషన్‌పై దృష్టి పెట్టిన మేకర్స్.. సడెన్ అప్‌డేట్స్‌ని విడుదల చేస్తూ మూవీపై ఆసక్తిని పెంచే ప్రయత్నం చేస్తున్నారు.
ఆమధ్య వరుస పాటల్ని వదిలారు. ఇప్పుడు టీజర్‌తో వచ్చారు. ట్రైలర్ రాబోతోంది అంటూ విడుదల చేసిన ఈ చిన్న టీజర్ చాలా ఇంటరెస్టింగ్‌గా ఉంది. ‘నా పేరు విక్రమాదిత్య. నేను దేవుణ్ని కాదు. అలా అని మీలో ఒకణ్ని కూడా కాదు’ అంటూ బేస్ వాయిస్‌తో ప్రభాస్ ఇంగ్లిష్‌లో చెప్పిన డైలాగ్స్ కాన్సెప్ట్‌పై క్యూరియాసిటీని కలిగిస్తున్నాయి.
అయితే ఇప్పటికీ రాధేశ్యామ్ ప్రమోషన్స్ విషయంలో ప్రభాస్ అభిమానులు కాస్త కోపంగానే ఉన్నారు. ఎందుకంటే అదే సీజన్‌లో వస్తోన్న ఆర్‌ఆర్‌ఆర్ మూవీ ప్రమోషన్స్ ఓ రేంజ్‌లో జరుగుతున్నాయి. ఆ టీమ్ దేశమంతా చుట్టేస్తోంది. అందరినీ తమ మాటలతో ఆకట్టుకుంటోంది. కానీ రాధేశ్యామ్ టీమ్ మాత్రం ఎవరి కంటికీ కనిపించకుండా ఇప్పటికీ ఇలా ఆన్‌లైన్‌లో అప్‌డేట్స్ వదులుతూ ఉండటం ఫ్యాన్స్‌కి రుచించడం లేదు.
నిజానికి రాధేశ్యామ్‌పై బజ్ తగ్గిపోయిందనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. సినిమాని నాలుగేళ్లు చెక్కడం, చాలా కాలం పాటు సరిగ్గా అప్‌డేట్స్ ఇవ్వకపోవడం వంటివి మెల్లమెల్లగా మూవీపై ఆసక్తిని తగ్గించేశాయని అంటున్నారు. అలాంటప్పుడు ప్రమోషన్స్ అయినా పీక్స్‌లో ఉండాలి కదా. ఏదో ఒక ఈవెంట్ పెట్టేస్తే సరిపోదు కదా. అలా జరగడం లేదేంటి, అసలు టీమ్‌కే సినిమాపై నమ్మకం పోయిందా అని ప్రశ్నిస్తున్నవారూ ఉన్నారు. దీనికి మేకర్స్ ఏమంటారో మరి.
This post was last modified on December 22, 2021 1:31 pm
అగ్రరాజ్యం అమెరికాలో చోటు చేసుకున్న పరిణామాలు.. విదేశీ విద్యార్థులు, వృత్తి నిపుణులను ఇరకాటంలోకి నెడుతున్నాయి. మరో రెండు మూడు వారాల్లోనే…
జైలు శిక్ష ఏమిటి? అందులోనూ ఫిఫ్టీ-ఫిఫ్టీ ఏమిటి- అనే ఆశ్చర్యం అందరికీ కలుగుతుంది. కానీ, ఇది వాస్తవం. దీనికి సంబంధించి…
ఏపీలో రాజకీయ వ్యూహాలు, ప్రతివ్యూహాలు ఎలా ఉన్నా.. అధికార పార్టీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు మాత్రం కాక పుట్టిస్తున్నాయి. ఇప్పటికే…
టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పరిటాల రవి గురించి యావత్ ఉమ్మడి రాష్ట్రానికి తెలిసిందే. అన్నగారు ఎన్టీఆర్ పిలుపుతో…
క్రిస్మస్కు తెలుగులో భారీ చిత్రాల సందడి ఉంటుందని అనుకున్నారు కానీ.. ఈ సీజన్‌లో వస్తాయనుకున్న గేమ్ చేంజర్, తండేల్, రాబిన్…