ప్రముఖ మలయాళ నటి పార్వతి తిరువొత్తు పోలీసులను ఆశ్రయించింది. అసభ్యకరమైన మెసేజ్ లు పంపిస్తూ.. ఓ వ్యక్తి తనను వేధిస్తున్నాడని ఫిర్యాదు చేసింది. ఆమె కంప్లైంట్ స్వీకరించిన పోలీసులు డిసెంబర్ 20న వేధింపులకు గురి చేస్తోన్న వ్యక్తిని అరెస్ట్ చేశారు. పోలీసుల సమాచారం ప్రకారం.. హర్ష అనే 35 ఏళ్ల వ్యక్తి రెండేళ్లుగా పార్వతి వెంటపడుతూ ఆమెని వేధిస్తున్నాడు.
కొన్ని రోజులుగా డెలివరీ బాయ్ గెటప్ లో ఫుడ్ పార్శిల్స్ ను తీసుకొని ఏకంగా పార్వతి ఇంటికొచ్చి మరీ రచ్చ చేస్తున్నాడట. దీంతో ఆమెతో పాటు కుటుంబసభ్యులు కూడా ఇలాంటి పనులు మానుకోవాలని హెచ్చరించినా.. అతడు వినలేదట. పార్వతిని ఇబ్బంది పెడుతూనే ఉన్నాడట. సెక్యూరిటీతో కూడా గొడవ పెట్టుకునేవాడట. ఇలా కొంతకాలంగా వేధిస్తూనే.. మరోపక్క తన మొబైల్ ఫోన్ కి అసభ్యకర రీతిలో మెసేజ్ లు పెడుతున్నాడంటూ పార్వతి పోలీసులకు వెల్లడించింది.
పార్వతి ఫిర్యాదు మేరకు హర్ష అనే వ్యక్తిపై ఐపీసీ సెక్షన్ 354 కింద కేసు నమోదు చేశారు పోలీసులు. ప్రస్తుతం అతడు కస్టడీలోనే ఉన్నట్లు తెలుస్తోంది. రెండేళ్ల క్రితం కూడా పార్వతి ఇలానే మరోవ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కిషోర్ అనే వ్యక్తి తాను లాయర్, ఫిల్మ్ మేకర్ అని చెప్పి.. పార్వతిని, ఆమె కుటుంబసభ్యులను పరిచయం చేసుకున్నాడు. ఆ తరువాత మెల్లగా పార్వతిని వేధించడం మొదలుపెట్టాడు. దీంతో ఆమె కిషోర్ పై పోలీసులకు ఫిర్యాదు చేసింది.
మాలయంలో పార్వతికి నటిగా మంచి పేరుంది. ‘బెంగుళూరు డేస్’, ‘ ఉయిరే’ వంటి హిట్ సినిమాల్లో నటించింది ఈ బ్యూటీ. ఈ ఏడాది విడుదలైన ‘నవరస’ వెబ్ సిరీస్ లో ఓ ఎపిసోడ్ లో కనిపించింది పార్వతి.
This post was last modified on December 22, 2021 10:45 am
ఒక యంగ్ హీరో ఇంకో ఇంకో యంగ్ హీరోను పెట్టి సినిమా ప్రొడ్యూస్ చేయడం అరుదు. నేచురల్ స్టార్ నాని…
కోన వెంకట్ ఒకప్పుడు తెలుగు ప్రేక్షకులు ఎంతో మెచ్చిన రైటర్. ఢీ, రెడీ, కింగ్, దూకుడు, అదుర్స్.. ఇలా ఎన్నో…
రాజకీయాల్లో ఉన్నవారు.. ఒకవైపే చూస్తామంటే కుదురుతుందా? ఒక వైపు ఆలోచన చేస్తామంటే కుదురుతుందా? అంటే కాదన్నది అందరికీ తెలిసిందే. కానీ,…
పెద్ది తర్వాత మూడు నెలలకు పైగా రెస్ట్ మోడ్ లో ఉన్న రామ్ చరణ్ త్వరలో ఆర్సి 17 కోసం…
అక్టోబర్ 9 నుంచి తప్పుకున్నాక ఆదర్శ కుటుంబం ఏకె 47 కొత్త విడుదల తేదీ కోసం దగ్గుబాటి అభిమానులు కళ్ళు…
ఒక కొత్త సినిమా ప్రోమో రాగానే దాన్ని గతంలో వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమాలతో పోల్చడం ఆడియన్స్ కు అలవాటే.…