తెలుగు సినిమాల్లో ఇతర భాషా నటీనటులకు ఎప్పుడూ స్థానం ఉంటూనే ఉంది. అయితే ఇటీవలి కాలంలో మలయాళ యాక్టర్స్ ఎక్కువగా కనిపిస్తున్నారు. ఆల్రెడీ మోహన్‌లాల్, మమ్ముట్టి లాంటి స్టార్స్ మన సినిమాల్లో నటించారు. రీసెంట్‌గా ‘పుష్ప’ కోసం వెర్సటైల్ యాక్టర్ ఫహాద్ ఫాజిల్ వచ్చాడు. ఈ కోవలో మరో నటుడు కూడా ఉన్నాడు. తనే ఉన్ని ముకుందన్.
‘జనతా గ్యారేజ్’లో మోహన్ లాల్ కొడుకుగా నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించి మంచి మార్కులే వేయించుకున్నాడు ముకుందన్. ఆ తర్వాత ‘భాగమతి’లో అనుష్కకి జోడీగా నటించాడు. అందులో తన పాత్ర నిడివి కొంచెమే అయినా చక్కగా నటించి మెప్పించాడు. రీసెంట్‌గా రవితేజ ‘ఖిలాడీ’లోనూ జాయినయ్యాడు. ఇప్పుడు సమంత నటిస్తున్న ‘యశోద’ చిత్రంలోనూ ఓ కీలక పాత్రకు ఎంపికయ్యాడు.
హరి, హరీష్ అనే కొత్త దర్శకులతో శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తున్న ‘యశోద’ ఓ సస్పెన్స్ థ్రిల్లర్. సమంత లీడ్ రోల్ చేస్తోంది. వరలక్ష్మీ శరత్‌కుమార్ ఓ కీలక పాత్రలో కనిపించనుంది. ఉన్ని ముకుందన్ కూడా ఈ చిత్రంలో నటిస్తున్నాడంటూ ఇప్పుడు అనౌన్స్‌మెంట్ వచ్చింది. ఈ సినిమా కథలాగే పాత్రలు కూడా కొత్తగా ఉంటాయట. ముకుందన్ పోషిస్తున్న గౌతమ్ పాత్రకి చాలా ప్రాధాన్యత ఉంటుందని చెబుతున్నారు. ఫిమేల్ సెంట్రిక్ మూవీ కనుక, ఇంతవరకు మరే హీరో పేరూ ప్రకటించలేదు కనుక అతడు సమంతకి జోడీ అయ్యే చాన్స్ ఉంది.
ఈ మూవీ షూటింగ్ ఇటీవలే హైదరాబాద్‌లో మొదలయ్యింది. సమంత, వరలక్ష్మి షూట్‌లో పాల్గొంటున్నారు. ఇప్పుడు ముకుందన్ కూడా జాయినయ్యాడు. ఇది ప్యాన్ ఇండియా ఫిల్మ్. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లోనూ రూపొందుతోంది. అందుకే అన్ని భాషల నటీనటులకూ చోటు కల్పిస్తున్నారు మేకర్స్. ముందు ముందు ఇంకెవరు యాడ్ అవుతారో మరి.
This post was last modified on December 22, 2021 10:10 am
నారా లోకేశ్… ఇప్పటిదాకా మనకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, ఏపీ కేబినెట్ లో కీలక శాఖలను నిర్వహిస్తున్న మంత్రిగా……
అగ్ర రాజ్యం అమెరికాకు 47వ అధ్యక్షుడిగా ఆ దేశ ప్రముఖ వ్యాపారవేత్త డొనాల్డ్ జే ట్రంప్ రెండు రోజుల క్రితం…
ఏపీలో ఈ ఏడాది సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటాయి. గతంలో ఎన్నడూ లేనంత భారీ స్థాయిలో సంక్రాంతి వేడుకలు జరిగాయి.…
చాలా ఏళ్ల నుంచి నాసిరకం సినిమాలు తీస్తూ తనకున్న గొప్ప పేరునంతా పోగొట్టుకుని దర్శకుడిగా జీరో అయిపోయాడు రామ్ గోపాల్…
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్.. ఈ వార్త బయటికి వచ్చినపుడు అందరూ ఆశ్చర్యపోయిన వాళ్లే. తెలుగులో సున్నితమైన లవ్ స్టోరీలు,…
నిజమే. కేవలం రూ.500 లను పెట్టుబడిగా పెట్టిన ఆ ట్రక్కు డ్రైవర్ రాత్రికి రాత్రే కోటీశ్వరుడిగా మారిపోయాడు. ఇదేదో ఎక్కడో…