పవన్ కళ్యాణ్ కొత్త సినిమా భీమ్లా నాయక్‌ను సంక్రాంతికి విడుదల చేయాలని నాలుగైదు నెలల ముందే నిర్ణయించారు. ఇక అప్పట్నుంచి సంక్రాంతి రిలీజ్ విషయంలో చాలా పట్టుదలతో కనిపిస్తున్నారు. ఈ సినిమా వాయిదా గురించి ఎప్పటికప్పుడు రూమర్లు వినిపిస్తుండగా.. చిత్ర బృందం మాత్రం వాటిని ఖండిస్తూనే వచ్చింది.
ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ లాంటి భారీ చిత్రాలకు థియేటర్లతో పాటు కలెక్షన్ల పరంగా సమస్య ఎదురవుతుందనే ఉద్దేశంతో భీమ్లా నాయక్‌ను వాయిదా వేయించడానికి దిల్ రాజు సహా కొందరు ప్రముఖులు గట్టిగా ఒత్తిడి తెచ్చినా భీమ్లా నాయక్ టీం తలొగ్గనట్లే కనిపించింది. కొన్ని వారాల నుంచి ఈ విషయంలో సస్పెన్స్ నడుస్తూనే ఉంది.
భీమ్లా నాయక్ టీం ఎప్పటికప్పుడు కొత్త ప్రోమోలు రిలీజ్ చేస్తూ జనవరి 12 విడుదలను ఖరారు చేస్తూనే వస్తోంది. అయినా సరే.. దాన్ని వాయిదా వేయించేందుకు ప్రయత్నాలు ఆగలేదు.
ఐతే ఎట్టకేలకు ఆ ప్రయత్నాలు ఫలించినట్లు తెలుస్తోంది. సంక్రాంతి రేసు నుంచి భీమ్లా నాయక్ తప్పుకున్నట్లుగా గట్టిగా ప్రచారం జరుగుతోంది. కొందరు పీఆర్వోలు, మీడియా ప్రముఖులు సంక్రాంతి లైనప్‌పై వరుసగా ట్వీట్లు వేస్తున్నారు. జనవరి 7న ఆర్ఆర్ఆర్, 14న రాధేశ్యామ్, 15న బంగార్రాజు రాబోతున్నట్లుగా పేర్కొంటున్నారు.
భీమ్లా నాయక్ సంక్రాంతి రేసు నుంచి తప్పుకుని ఫిబ్రవరికి వాయిదా పడుతున్నట్లుగా చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా భీమ్లా నాయక్ టీం సైలెంటుగా ఉండటానికి ఇదే కారణమంటున్నారు.
మంగళవారం ఇదే విషయాన్ని ప్రెస్ మీట్ పెట్టి వెల్లడించబోతున్నారని.. ఇందులో దిల్ రాజుతో పాటు భీమ్లా నాయక్ నిర్మాతలు కూడా పాల్గొంటారని.. ఇండస్ట్రీ మంచి కోసం ఏ పరిస్థితుల్లో సినిమాను వాయిదా వేయాల్సి వచ్చిందో అభిమానులకు వివరించబోతున్నారని సమాచారం.
This post was last modified on December 21, 2021 8:47 am
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటనలో భాగంగా ఢిల్లీలోని 'హైదరాబాద్ హౌస్'లో బస చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.…
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పర్యటనల్లో అధికారులు పుష్పగుచ్ఛాలు ఇవ్వడం, శాలువాలు వేయడం లాంటివి వద్దని సున్నితంగా…
బడ్జెట్ రెండు వందల ఎనభై కోట్ల పైమాటే. అదిరిపోయే బాలీవుడ్ క్యాస్టింగ్ ఉంది. యాక్షన్ విజువల్స్ చూస్తే మైండ్ బ్లోయింగ్…
చిన్నదా..పెద్దదా..అన్న విషయం పక్కనబెడితే..దొంగతనం అనేది నేరమే. ఆ నేరం చేసిన వారికి తగిన శిక్ష పడాలని కోరుకోవడం సహజం. కానీ,…
2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…
ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…