సరైన సినిమాలు పడక ఒక స్థాయికి మించి ఎదగలేకపోతున్నాడు కానీ.. తెలుగులో ఉన్న మంచి నటుల్లో సత్యదేవ్ ఒకడు. కేవలం నటన విషయంలోనే కాదు.. లుక్స్ విషయంలోనూ అతను చాలామంది స్టార్లను మించి స్కోర్ చేస్తాడు. కానీ బ్యాగ్రౌండ్ లేకపోవడం వల్ల, పేరున్న దర్శకులతో సరైన సినిమాలు చేయకపోవడం వల్ల సత్యదేవ్‌కు సరైన బ్రేక్ రాలేదు. ఐతే తన సినిమాల ఫలితాలతో సంబంధం లేకుండా సత్యదేవ్‌కు నటుడిగా మాత్రం మంచి మార్కులే పడుతుంటాయి.
ఈ ఏడాది అతడి నుంచి వచ్చిన తిమ్మరసు, స్కైలాబ్ సినిమాలు కమర్షియల్‌గా అనుకున్నంత ఆడకపోయినా సత్యదేవ్ పెర్ఫామెన్స్ అందరినీ మెప్పించింది. ఇప్పుడతను ‘గాడ్సే’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇంతకుముందు సత్యదేవ్‌తో ‘బ్లఫ్ మాస్టర్’ తీసిన గోపీగణేష్ పట్టాభి రూపొందించిన చిత్రమిది.
ఈ రోజే ‘గాడ్సే’ టీజర్ లాంచ్ చేశారు. ఇందులో పూర్తిగా సత్యదేవ్ డామినేషన్ కనిపించింది. అవినీతి పరులైన రాజకీయ నాయకులపై యుద్ధం చేసే రెబలియన్ పాత్రలో కనిపించనున్నాడు సత్యదేవ్. ‘‘ఏ నినాదం వెనుక ఏ ప్రయోజనాలు దాగి ఉన్నాయో తెలియనంత కాలం ప్రజలు మోసపోతూనే ఉంటారు’’ అనే ఇంట్రెస్టింగ్ డైలాగ్‌తో టీజర్ మొదలైంది. ఆ తర్వాత వ్యవస్థకు సవాలు విసురుతున్న హీరో (గాడ్సే)ను పట్టుకోవడానికి రంగంలోకి దిగిన పోలీసాఫీసర్‌గా ఐశ్వర్యా లక్ష్మి (జగమే తంత్రం హీరోయిన్) రంగంలోకి దిగింది. గాడ్సే లక్ష్యం సేవ పేరుతో జనాల్ని దోచుకు తింటున్న రాజకీయ నాయకులను హీరో టార్గెట్ చేయడం.. హీరోను పట్టుకోవడానికి వ్యవస్థ మొత్తం రంగంలోకి దిగడం.. ఈ కోణంలో కథ నడిచేలా కనిపిస్తోంది.
ఒంటికి టైం బాంబు తగిలించుకుని రాజకీయ నాయకుల దోపిడీ గురించి డైలాగ్ చెప్పే షాట్ చూస్తే నటుడిగా సత్యదేవ్ విశ్వరూపాన్ని ఈ సినిమాలో చూడబోతున్నామనిపిస్తోంది. అతడి స్థాయికి మించి ఈ సినిమా మీద నిర్మాత సి.కళ్యాణ్ భారీగానే ఖర్చు పెట్టినట్లున్నాడు. టీజర్లో విజువల్స్, కాస్టింగ్, టెక్నికల్ వాల్యూస్ అంత రిచ్‌గా కనిపించాయి. మరి ఈ సినిమాతో సత్యదేవ్ కెరీర్ మలుపు తిరుగుతుందేమో చూడాలి.
This post was last modified on December 20, 2021 11:05 pm
దేశీయ పారిశ్రామిక వర్గాల్లో ఇప్పుడో పెద్ద చర్చ నడుస్తోంది హెలికాఫ్టర్ల తయారీలో దిగ్గజ కంపెనీగా కొనసాగుతున్న ఎయిర్ బస్ తన కొత్త…
సూళ్ళురుపేట లో ఈ నెల 18 నుండి 20 వరకు జరుగుతున్న ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 వేడుకలు శనివారం ఉదయం…
ఏపీలోని కూటమి సర్కారులో కీలక పాత్ర పోషిస్తున్న టీడీపీలో సీనియర్ నాయకుల వ్యవహారం కొన్నాళ్లుగా చర్చకు వస్తోంది. సీనియర్లు సహకరించడం…
కీలక నిర్ణయాన్ని తీసుకుంది రేవంత్ సర్కారు. హైదరాబాద్ మహానగరి విస్త్రతిని పెంచేస్తూ అంచనాల్ని సిద్ధం చేసింది. ఇప్పటివరకు హెచ్ఎండీఏ (హైదరాబాద్…
ఏపీ పర్యటనకు వచ్చిన కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా వద్ద ఏపీ సీఎం చంద్రబాబు…
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందన్నది చెప్పలేం. రాజకీయాలు రాజకీయాలే. ఇప్పుడు ఇలాంటి పరిణామమే ఎన్టీఆర్ జిల్లాలోనూ జరుగుతోంది. టీడీపీ ఎమ్మెల్యే…