లాక్ డౌన్ నేపథ్యంలో సినిమా హాళ్లు బంద్ కావటం.. షూటింగ్ లు నిలిపివేయటంతో టీవీ సీరియల్స్ కు బ్రేకులు పడ్డాయి. దీంతో.. ఏ రోజుకు ఆ రోజు వినోదం అలవాటు పడిన వారంతా సినిమాలు చూడటం మొదలు పెట్టారు. తాము చూసిన సినిమాల్ని అదే పనిగా రిపీట్ చేస్తున్న నేపథ్యంలో.. అనివార్యంగా ఓటీటీ ఫ్లాట్ ఫాం వైపుకు మళ్లారు. వాణిజ్య పరంగా పెద్దగా విజయవంతం కాని ఎన్నో సినిమాలు సామాన్యుల చెంతకు చేరాయి. పెద్ద ఎత్తున సినిమాలు అందుబాటులో ఉండటం.. క్లిక్ దూరంలో ఉన్న సినిమాలు చూడటం ఒక అలవాటుగా మారింది.
అలాంటి సినిమాల్లో రెండేళ్ల క్రితం విడుదలైన బాలీవుడ్ మూవీ ‘సూర్మా’ ఒకటి. ప్రముఖ హాకీ క్రీడాకారుడు సందీప్ సింగ్ బయోపిక్ ఇది. కమర్షియల్ గా విజయవంతం కాని ఈ సినిమా చాలామందికి తెలీదు. కానీ.. ఓటీటీ ఫ్లాట్ ఫాంలో ఉండటం.. లాక్ డౌన్ నేపథ్యంలో ఇప్పుడీ సినిమా చాలామంది చూసే అవకాశం లభించింది. మంచి కంటెంట్ తో ఉన్న ఈ సినిమా మిస్ కావటమేమిటని ఆశ్చర్యపోయినోళ్లు చాలామందే ఉన్నారు.
ఒక అమ్మాయి ప్రేమలో పడి.. హాకీ క్రీడాకారుడు కావటం.. దేశం తరఫున ఆడటం ఒక ఎత్తు అయితే.. అనూహ్యంగా జరిగిన ప్రమాదంలో వెన్నుపూస దగ్గర గాయమై వీల్ ఛైర్ కే పరిమితమవుతాడు. అలాంటిది పట్టుదలతో నడవటమే కాదు.. మరోసారి అతనికి భారతజట్టు తరఫున ఆడే అద్భుత అవకాశం లభిస్తుంది. జీవితంలో నడిచే అవకాశమే లేదన్న వైద్యులు సైతం ఆశ్చర్యపోయేలా నడవటమే కాదు.. భారత హాకీ జట్టునడిచేలా చేయటానికి మించిన రియల్ డ్రామా ఇంకేం ఉంటుంది. 2008లో జరిగిన అజ్లాన్ షా కప్ లో తొమ్మిది గోల్స్ చేసి టాపర్ గా నిలవటమే కాదు.. భారత హాకీ జట్టుకు కెప్టెన్ గా పేరు ప్రఖ్యాతుల్ని సంపాదించాడు.
క్లిష్టమైన డ్రాగ్ ఫ్లికర్ షాట్ ను అలవోకగా కొట్టే సందీప్ 2012 లండన్ ఒలింపిక్స్ కు అర్హత సాధించటంలో కీలకభూమిక పోషించాడు. ఫ్రాన్స్ తో జరిగిన ఆఖరి క్వాలిఫయర్ పోరులో భారత్ 9-1 తేడాతో విజయం సాధించటంలో సందీప్ చేసిన ఐదు గోల్స్ కీలకం. కెరీర్ లో వంద గోల్స్ సాధించిన సందీప్ కథ అక్కడితో పూర్తి కాలేదు. బయోపిక్ లో చూపించినట్లు ఆటలో సక్సెస్ అయ్యాక.. గడిచిన రెండేళ్లలో అతడి జీవితంలో చాలానే మార్పులు చోటు చేసుకున్నాయి.
హరియాణా పోలీసు విభాగంలో ఐదేళ్ల పాటు డీఎస్పీగా పని చేయటమే కాదు.. గత ఏడాది రాజకీయాల్లోకి వచ్చాడు. థర్టీ ప్లస్ వయసులోనే బీజేపీ తరఫున పెహోవా నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందిన అతగాడు.. ప్రస్తుతం హరియాణా రాష్ట్ర క్రీడామంత్రిగా వ్యవహరిస్తున్నారు. బయోపిక్ లో ఆటలో విజయం సాధించటంతో సినిమా ముగుస్తుంది. కానీ.. అతడు మాత్రం తన సక్సెస్ జర్నీని అంతకంతకూ విస్తరిస్తూ ముందుకెళుతున్నాడు.
This post was last modified on June 9, 2020 9:59 am
ఐపీఎల్ 2025 కోసం జరుగుతున్న ఆటగాళ్ల వేలంలో బీహార్ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ మెగా…
ఏపీ డిప్యూటీ సీఎంగా పవన్ కల్యాణ్ పగ్గాలు చేపట్టినప్పటి నుంచి తన మార్క్ నిర్ణయాలతో ప్రశంసలు అందుకుంటోన్న సంగతి తెలిసిందే.…
జనసేన నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డిపై వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన…
తెలుగులో నితిన్ లై చిత్రంతో మేఘ ఆకాష్ హీరోయిన్గా తెలుగు తెరకు పరిచయమైంది. రజనీకాంత్ పేట మూవీ తో తమిళ్…
ప్రముఖ ప్రవచన కర్త.. ఆధ్యాత్మిక వేత్త చాగంటి కోటేశ్వరరావును ఏపీ ప్రభుత్వం `నైతిక విలువల` సలహాదారుగా నియమించిన విషయం తెలిసిందే.…
మహానటితో గొప్ప పెర్ఫార్మర్ గా పేరు తెచ్చుకున్న కీర్తి సురేష్ ఆ తర్వాత ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాలు చాలా చేసింది…