ఆల్రెడీ ప్రియదర్శన్ కూతురు కళ్యాణి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి పలు సినిమాలు చేసింది. ఇప్పుడు మరో దర్శకుడి కూతురు కూడా తెరంగేట్రం చేస్తోంది. ఆమె మరెవరో కాదు. గ్రేట్ డైరెక్టర్ శంకర్ షణ్ముగం కూతురు అదితి. కార్తి హీరోగా తెరకెక్కుతున్న ‘విరుమాన్’ మూవీతో ఆమె నటిగా తొలి అడుగు వేస్తోంది. అదింకా సెట్స్‌పై ఉండగానే శింబు సరసన నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
శింబు హీరోగా గోకుల్ డైరెక్షన్‌లో ‘కరోనా కుమార్’ అనే చిత్రం రానుంది. వేల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ సంస్థ దీన్ని నిర్మిస్తోంది. ప్రస్తుతం గౌతమ్ మీనన్ డైరెక్షన్‌లో ‘వెందు తుణీందదు కాడు’ చిత్రంతో బిజీగా ఉన్న శింబు.. అది పూర్తయ్యాక ఈ సినిమా స్టార్ట్ చేయబోతున్నాడు. ఇందులో హీరోయిన్‌గా అదితి ఫైనల్ అయ్యింది. త్వరలో అనౌన్స్‌మెంట్ కూడా రాబోతోంది.
అదితి బేసిగ్గా డాక్టర్. ఇటీవలే పట్టా పుచ్చుకుంది. కానీ ఆమెకి నటిగా పేరు తెచ్చుకోవాలని ఆశ. దాంతో ఓవైపు మెడిసిన్ చదువుతూనే సినిమాలపై దృష్టి పెట్టింది. అదితి అందంగా ఉంటుంది. పైగా స్వయానా శంకర్ కూతురు కూడా కాబట్టి వరుస అవకాశాలు వచ్చి బ్యాగ్‌లో పడుతున్నాయి. ఆమె ప్రయాణం ప్రారంభం నుంచే జెట్ స్పీడులో సాగుతోంది. మరి నటిగా ఎన్ని మార్కులు వేయించుకుంటుందో.. ఏదో ఒక రోజు తన తండ్రి సినిమాలో హీరోయిన్‌గా నటించే స్థాయికి చేరుకుంటుందో లేదో చూడాలి.
This post was last modified on December 20, 2021 7:40 pm
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…