నేచురల్ స్టార్ నాని కొత్త సినిమా ‘శ్యామ్ సింగరాయ్’ ఇంకో నాలుగు రోజుల్లోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. నాని గత రెండు సినిమాలు వి, టక్ జగదీష్ అన్ని రకాలుగా ప్రేక్షకులను నిరాశకు గురి చేశాయి. ఇవి ఓటీటీ బాట పట్టడం ముందు నాని అభిమానులకు అస్సలు రుచించలేదు. ఆ తర్వాత అవి అంచనాలకు తగ్గట్లు లేకపోవడంతో ఇంకా నిరాశకు గురయ్యారు. ఇప్పుడు నాని థియేటర్లలో ఒక సినిమాను రిలీజ్ చేసి పెద్ద హిట్ కొట్టాల్సిన ఒత్తిడిని ఎదుర్కొంటున్నాడు.
ఈ నేపథ్యంలో ‘శ్యామ్ సింగ రాయ్’పై చాలా భారమే ఉంది.
ఈ సినిమా ప్రోమోలు చూస్తే ప్రామిసింగ్‌గానే అనిపిస్తున్నాయి కానీ.. అదే సమయంలో దీని కమర్షియల్ సక్సెస్ మీద కాస్త సందేహాలు కూడా కలుగుతున్నాయి. ఇది చాలా సీరియస్‌గా సాగే సినిమాలా కనిపిస్తోంది. నాని నుంచి బేసిగ్గా ఆశించే ఎంటర్టైన్మెంట్ కనిపించడం లేదు. శ్యామ్ సింగ రాయ్ క్యారెక్టర్లో హీరోయిజం కనిపిస్తున్నప్పటికీ.. నాని నుంచి మాస్ ఎలివేషన్ల కంటే ఎంటర్టైన్మెంటే ఎక్కువ కోరుకుంటారు ప్రేక్షకులు.
ఈ నేపథ్యంలో సినిమాకు మంచి టాక్ వచ్చినా ఏమేర ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తుందో అన్న టెన్షన్ అయితే లేకపోలేదు. ‘శ్యామ్ సింగ రాయ్’కున్న మరో పెద్ద ప్రతికూలత.. భారీ సినిమాల మధ్య పడటం. ఇప్పటికే అఖండ, పుష్ప రూపంలో రెండు భారీ చిత్రాలు విడుదలయ్యాయి. ‘శ్యామ్ సింగ రాయ్’ వచ్చిన రెండు వారాలకు ‘ఆర్ఆర్ఆర్’ రాబోతోంది. తర్వాత భీమ్లా నాయక్, రాధేశ్యామ్ ఉన్నాయి. సగటు సినీ ప్రేక్షకుడు ఇలాంటి పెద్ద సినిమాలను టాక్‌తో సంబంధం లేకుండా చూడాలనుకుంటాడు.
వాటి కోసం చాలా డబ్బులు ఖర్చవుతున్నపుడు.. మధ్యలో ఒక మీడియం రేంజ్ సినిమా వస్తే దాన్ని ఇగ్నోర్ చేసేందుకు ఆస్కారముంది. సినిమా చాలా బాగుందంటే తప్ప అలాంటి సినిమాల వైపు చూడకపోవచ్చు. పైగా వి, టక్ జగదీష్ చిత్రాల వల్ల నాని క్రెడిబిలిటీ కొంచెం తగ్గింది. ఈ నేపథ్యంలో ‘శ్యామ్ సింగ రాయ్’కి ప్రతికూలతలైతే చాలానే కనిపిస్తున్నాయి. ఇలాంటి స్థితిలో సినిమా నాని కోరుకున్న విజయం అందించాలంటే అసాధారణంగానే ఉండాలి. చూద్దాం నాని, రాహుల్ కలిసి ఎలాంటి చిత్రాన్ని డెలివర్ చేశారో?
This post was last modified on %s = human-readable time difference 7:12 pm
తండేల్ విడుదల తేదీ సస్పెన్స్ కు చెక్ పెడుతూ ఫిబ్రవరి 7 అఫీషియల్ గా ప్రకటించారు. నిన్నే ఇది లీకైనప్పటికీ…
ఏదైనా వేదిక ఎక్కి మైక్ పట్టుకున్నపుడు, మీడియా ముందు మాట్లాడుతున్నపుడు కొందరికి పూనకాలు వచ్చేస్తాయి. ముఖ్యంగా రాజకీయ నాయకులు నోటికి…
తమిళనాట దశాబ్దాల పాటు సూపర్ స్టార్ రజినీకాంతే నంబర్ వన్ హీరోగా ఉండేవారు. ఆయన సినిమాల బడ్జెట్లు, బిజినెస్, కలెక్షన్లు…
కొన్నిసార్లు స్టార్ హీరోల ప్రెస్ మీట్లలో ఊహించని ప్రశ్నలు ఎదురవుతాయి. వాటికి ఎమోషనల్ గా స్పందిస్తే సోషల్ మీడియాలో విపరీత…
తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు అత్యంత హాట్ టాపిక్ ఏదైనా ఉందా అంటే… అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీట్ ఊస్టవడం!.…
పెళ్లి చూపులుతో దర్శకుడిగా పరిచయమై ఈ నగరానికి ఏమైంది ద్వారా యూత్ లో ట్రెండీ ఫాలోయింగ్ తెచ్చుకున్న దర్శకుడు తరుణ్…