‘పుష్ప’ రిలీజ్ రోజు తమన్ ఎలా ట్రెండ్ అవుతాడు? ఈ సినిమాకు సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ కదా.. అతను కాకుండా తమన్ ఎందుకు హైలైట్ అవుతాడు అనిపిస్తోందా? అక్కడే ఉంది ట్విస్టు. కొన్ని రోజుల కిందటే ‘అఖండ’ సినిమా రిలీజైంది. ఆ సినిమాకు తమన్ బ్యాగ్రౌండ్ స్కోర్‌తో ప్రాణం పోశాడు అంటే అతిశయోక్తి కాదు. అందులో హీరో ఎలివేషన్ సీన్లకు, యాక్షన్ ఘట్టాలకు తమన్ ఇచ్చిన బ్యాగ్రౌండ్ స్కోర్ గురించి ఎంత చెప్పినా తక్కువే.
ముఖ్యంగా అఖండ పాత్ర ప్రవేశించిన దగ్గర్నుంచి తమన్ నేపథ్య సంగీతంతో ఒక రకమైన తాండవమే చేశాడు. ఒక కమర్షియల్ సినిమాలో ఇలాంటి బ్యాగ్రౌండ్ తెలుగులోనే కాదు.. ఇండియాలోనే నభూతో అంటే ఆశ్చర్యపడాల్సిన పని లేదు. సౌండ్ లేకుండా చూస్తే మామూలుగా అనిపించే సన్నివేశాలను సైతం తన నేపథ్య సంగీతంతో మరో స్థాయికి తీసుకెళ్లిన ఘనత తమన్‌దే. అంతకుముందు ‘వకీల్ సాబ్’ లాంటి క్లాస్ టచ్ సినిమాలో సైతం తన బ్యాగ్రౌండ్ స్కోర్‌తో గూస్ బంప్స్ ఇచ్చాడు తమన్.
తన కెరీర్లోనే అత్యుత్తమ ఫామ్‌తో తమన్ దూసుకుపోతూ.. సినిమా సినిమాకూ కొన్ని మెట్లు ఎక్కేస్తుంటే.. ఒకప్పుడు అతడితో పోలిస్తే తిరుగులేని స్థాయిలో ఉన్న దేవిశ్రీ ప్రసాద్ ఒక్కో మెట్టు కిందికి దిగేస్తున్నాడు. గత ఏడాది సంక్రాంతి టైంలో ‘అల వైకుంఠపురములో’తో ‘సరిలేరు నీకెవ్వరు’ పోటీ పడ్డపుడు దేవిశ్రీ పాటలు, నేపథ్య సంగీతం పరంగా పూర్తిగా తేలిపోయాడు. ఇప్పుడు తమన్‌తో డైరెక్ట్ వార్ లేకపోయినా.. ప్రేక్షకులు మాత్రం అతడితో దేవిని పోల్చి అతడి గాలి తీసేస్తున్నారు. మామూలు సినిమా అయిన ‘అఖండ’ను తన నేపథ్య సంగీతంతో తమన్ మరో రేంజికి తీసుకెళ్తే.. ‘పుష్ప’ను దేవిశ్రీ తన ఆర్ఆర్‌తో కిల్ చేశాడనే విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.
పాటలు బాగానే ఉన్నప్పటికీ బ్యాగ్రౌండ్ స్కోర్ పూర్తిగా తేలిపోయిందనే అభిప్రాయం విస్తృతంగా వ్యక్తమవుతోంది. ఈ సినిమాలో మైనస్‌గా అందరూ ఏకాభిప్రాయం వ్యక్తం చేస్తున్నది బ్యాగ్రౌండ్ స్కోర్ విషయంలోనే. ఏమాత్రం కొత్తగా ప్రయత్నించకుండా.. ఎలివేషన్‌కు ఛాన్సే లేకుండా చాలా మామూలుగా, మొక్కుబడిగా లాగించేయగా.. దానికి తోడు సౌండ్ డిజైన్ అదీ కూడా సరిగా చేయకపోవడంతో అతడి స్కోర్ తేలిపోయింది. అందుకు తగ్గట్లే సన్నివేశాలు కూడా తుస్సుమనిపించేశాయి. దీంతో సోషల్ మీడియాలో తమన్‌తో పోలుస్తూ దేవిశ్రీ మీద విమర్శలు గుప్పిస్తున్నారు నెటిజన్లు.
This post was last modified on December 18, 2021 7:24 pm
సూళ్ళురుపేట లో ఈ నెల 18 నుండి 20 వరకు జరుగుతున్న ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 వేడుకలు శనివారం ఉదయం…
ఏపీలోని కూటమి సర్కారులో కీలక పాత్ర పోషిస్తున్న టీడీపీలో సీనియర్ నాయకుల వ్యవహారం కొన్నాళ్లుగా చర్చకు వస్తోంది. సీనియర్లు సహకరించడం…
కీలక నిర్ణయాన్ని తీసుకుంది రేవంత్ సర్కారు. హైదరాబాద్ మహానగరి విస్త్రతిని పెంచేస్తూ అంచనాల్ని సిద్ధం చేసింది. ఇప్పటివరకు హెచ్ఎండీఏ (హైదరాబాద్…
ఏపీ పర్యటనకు వచ్చిన కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా వద్ద ఏపీ సీఎం చంద్రబాబు…
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందన్నది చెప్పలేం. రాజకీయాలు రాజకీయాలే. ఇప్పుడు ఇలాంటి పరిణామమే ఎన్టీఆర్ జిల్లాలోనూ జరుగుతోంది. టీడీపీ ఎమ్మెల్యే…
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా శనివారం రాత్రి ఏపీ పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు ఏపీ…