Movie News

రాధేశ్యామ్ టీం వినూత్న ప్రయోగం

‘అఖండ’ సందడి పూర్తయింది. ఇప్పుడిక ‘పుష్ప’ హంగామా మొదలైంది. మధ్యలో వేరే సినిమాలు ఉన్నప్పటికీ.. ఇక ఆటోమేటిగ్గా సంక్రాంతి సినిమాల మీదికి ఫోకస్ వెళ్తుంది. సంక్రాంతి ముంగిట రాబోతున్న ‘ఆర్ఆర్ఆర్’ కోసం టీం ఇప్పటికే ప్రమోషన్లు హోరెత్తిస్తోంది. ఈ నెల 19న ముంబయిలో భారీ ఈవెంట్ కూడా ప్లాన్ చేశారు. ఇక సంక్రాంతి రోజే రిలీజ్ కాబోతున్న ‘రాధేశ్యామ్’ టీం ఇప్పటిదాకా పాటల రిలీజ్‌తో సోషల్ మీడియా వరకే ప్రమోషన్లను పరిమితం చేసింది.

ఇక ఆఫ్ లైన్ ప్రమోషన్ కూడా మొదలు పెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నెల 23న హైదరాబాద్‌లోని రామోజీ ఫిలిం సిటీలో భారీ ఎత్తున ప్రి రిలీజ్ ఈవెంట్ చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. మామూలుగా ప్రి రిలీజ్ ఈవెంట్లు ఎక్కువగా శిల్ప కళా వేదిక, జేఆర్సీ కన్వెన్షన్ లాంటి వేదికల్లో జరుగుతుంటాయి. కానీ అక్కడ పరిమిత సంఖ్యలోనే అభిమానులకు చోటుంటుంది.

ఐతే ప్రభాస్ రేంజికి తగ్గట్లు ఓపెన్ గ్రౌండ్లో ‘రాధేశ్యామ్’ ప్రి రిలీజ్ ఈవెంట్ చేసి.. ఎక్కువమంది అభిమానులకు అవకాశం కల్పించాలని చిత్ర బృందం భావించింది. ముందు ఎల్బీ స్టేడియంలో వేడుక చేయడానికి ప్రయత్నించారు కానీ.. అనుమతులు రాలేదు. దీంతో ‘బాహుబలి’ ఈవెంట్‌కు వేదికైన రామోజీ ఫిలిం సిటీలోనే ఈ ఈవెంట్ చేయడానికి నిర్ణయించారు. అక్కడ ఈవెంట్ కోసం పెద్ద గ్రౌండ్ లాంటిది తీసుకుని ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈ ఈవెంట్‌ను స్పెషల్‌గా చేయడానికి ఒక వినూత్న ప్రయోగం చేస్తోంది రాధేశ్యామ్ టీం. ఈ కార్యక్రమాన్ని కేవలం తెలుగు అభిమానులకు పరిమితం చేయకుండా.. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి అభిమానులను ఆహ్వానిస్తున్నారు. అంతే కాదు.. ‘రాధేశ్యామ్’ ట్రైలర్‌ను ఎవరో ప్రముఖుల చేతుల మీదుగా కాకుండా ఎంపిక చేసిన కొందరు ఫ్యాన్స్ చేతుల మీదుగా లాంచ్ చేయబోతున్నారు. తద్వారా అభిమానులకు ప్రభాస్ ఇచ్చే ప్రయారిటీ ఎలాంటిదో చూపించబోతున్నారు. ఈ ఆలోచన పట్ల సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి.

This post was last modified on December 18, 2021 4:16 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అదానీ-జగన్ లింకుపై చంద్రబాబు ఫస్ట్ రియాక్షన్

సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…

5 hours ago

ఈవన్నీ చేస్తే AP టూరిజంకు తిరుగుండదు

జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…

7 hours ago

రేవంత్ రెడ్డి.. అదానీ ఒప్పందాలు రద్దు చేస్తారా?

అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…

8 hours ago

మంచు విష్ణు అసలు ప్లానింగ్ ఇదా

మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…

9 hours ago

సాక్షి మీడియా నన్ను కవర్ చేయదు…షర్మిల సెటైర్లు

మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…

9 hours ago