స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’ సినిమా శుక్రవారం నాడు విడుదలైన సంగతి తెలిసిందే. హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా కలెక్షన్స్ పరంగా దూసుకుపోతుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి ‘పుష్ప’ సినిమా సెకండ్ పార్ట్ కి సంబంధించిన షూటింగ్ జరగనుంది. వీలైనంత త్వరగా పార్ట్ 2ని పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
నిజానికి పార్ట్ 2 కంటే ముందుగా బన్నీ మరో సినిమా చేయాలనుకున్నారు. కానీ లుక్ ని మార్చుకోవాల్సి వస్తుందని.. ఆ ఆలోచన పక్కన పెట్టేశారు. అయితే ఈ సినిమాను పూర్తి చేసిన తరువాత బన్నీ.. బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా చేయాలనుకుంటున్నారు.
ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఇదొక పీరియాడిక డ్రామా అని తెలుస్తోంది. ఇండియాకు స్వాతంత్య్రం రాకముందు కాలానికి చెందిన కథ ఇది. ఈ కాన్సెప్ట్ బన్నీకి బాగా నచ్చిందట. ఇప్పటికే బోయపాటి స్క్రిప్ట్ వర్క్ కూడా మొదలుపెట్టినట్లు తెలుస్తోంది.
‘పుష్ప’ పార్ట్ 2 షూటింగ్ పూర్తయిన వెంటనే.. బన్నీ గ్యాప్ తీసుకోకుండా బోయపాటి సినిమాను మొదలుపెట్టాలని భావిస్తున్నారు. ఇది కూడా పాన్ ఇండియా సినిమా అని సమాచారం. గీతాఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ ఈ సినిమాను నిర్మించబోతున్నారు. వచ్చే ఏడాది ఆరంభంలోనే ఈ సినిమాకి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ రాబోతుంది.
This post was last modified on December 18, 2021 2:58 pm
ఏఐ కోసం కంప్యూటర్లు, పెద్ద పెద్ద డేటా సెంటర్లు భూమిపైనే ఉంటాయని మనకు తెలుసు. కానీ హైదరాబాద్‌కు చెందిన ఓ…
ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో నాలుగు స్తంభాలాట జోరుగా సాగుతోంది. అంటే.. నాయకుల మధ్య వివాదాలు, విభేదాల గురించి కాదు.. నాలుగు…
మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…
ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…
ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…