నందమూరి బాలకృష్ణ కెరీర్ దారుణంగా దెబ్బ తిని, ఆయన పతనావస్థను చూస్తున్న టైంలో ‘సింహా’ సినిమాతో నందమూరి హీరోను మళ్లీ ట్రాక్‌లోకి తీసుకొచ్చాడు బోయపాటి శ్రీను. కానీ ఈ విజయాన్ని బాలయ్య నిలబెట్టుకోలేదు. ఆ తర్వాత పరమవీర చక్ర, అధినాయకుడు, శ్రీమన్నారాయణ లాంటి పేలవమైన సినిమాలు చేసి క్రేజ్‌నంతా దెబ్బ తీసుకున్నాడు.
కెరీర్ మరోసారి పట్టాలు తప్పిన సమయంలో మళ్లీ బాలయ్యను రక్షించింది బోయపాటినే. వీరి కలయికలో వచ్చిన రెండో సినిమా ‘లెజెండ్’ సైతం బ్లాక్‌బస్టర్ కావడం తెలిసిందే. ఐతే ఈసారి కూడా బాలయ్య ఈ సక్సెస్‌ను నిలబెట్టుకోలేదు.
‘గౌతమీపుత్ర శాతకర్ణి’ని మినహాస్తే బాక్సాఫీస్ దగ్గర బాలయ్యకన్నీ పరాభవాలే ఎదురయ్యాయి. ముఖ్యంగా యన్.టి.ఆర్, రూలర్ సినిమాలతో కెరీర్లోనే అత్యంత దారుణమైన పతనాన్ని చూశాడు బాలయ్య. ఈ దెబ్బతో బాలయ్య పనైపోయిందని చాలామంది అన్నారు. కాన ఆ టైంలో మళ్లీ బోయపాటితో జట్టు కట్టి ‘అఖండ’ రూపంలో తన కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ కొట్టాడు.
రాజమౌళితో సినిమా చేశాక హీరోలందరికి ఫెయిల్యూర్లు వచ్చినట్లే.. బోయపాటితో పెద్ద హిట్ కొట్టాక బాలయ్య కెరీర్ గాడి తప్పడం సాధారణం అయిపోయింది. ఐతే గత రెండు పర్యాయాలకు భిన్నంగా బాలయ్య ఈసారి ఏమైనా జాగ్రత్త పడతాడా.. మళ్లీ బోయపాటి వచ్చి రక్షించాల్సిన అవసరం లేకుండా కెరీర్‌ను గాడిన పెట్టుకుంటాడా అని అభిమానులు చూస్తున్నారు.
ఇంతకుముందులా ఔట్ డేటెడ్ డైరెక్టర్లకు ఛాన్సులు ఇవ్వకుంటే, కథల విషయంలో కొంచెం జాగ్రత్త పడితే బాలయ్య ఈ ఫాంను కొనసాగించడం కష్టమేమీ కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రస్తుతానికి బాలయ్య కమిట్మెంట్లు చూస్తే పరిస్థితి ఆశాజనకంగానే ఉంది.
‘క్రాక్’తో బ్లాక్‌బస్టర్ కొట్టిన గోపీచంద్ మలినేనితో, అలాగే అనిల్ రావిపూడితో బాలయ్య సినిమాలు ఓకే చేశాడు. త్వరలోనే గోపీచంద్ సినిమా సెట్స్ మీదికి కూడా వెళ్లబోతోంది. ఆ తర్వాత అనిత్‌తో బాలయ్య సినిమా ఉంటుంది. మళ్లీ బోయపాటితో అవకాశం ఉన్నపుడు బాలయ్య జట్టు కడితే ఓకే కానీ.. ఇంకోసారి బాలయ్య కెరీర్ పతనావస్థలో ఉండగా అతను రక్షించాల్సిన పరిస్థితి రాకుండా చూసుకుంటే బెటర్.
This post was last modified on December 16, 2021 10:41 pm
వైసీపీ కీలక నేత, హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ కు శుక్రవారం ఊహించని షాక్ తగిలింది. పోలీసుల అదుపులోని నిందితుడిపై…
దక్షిణాదిలో కీలక రాష్ట్రంగా కొనసాగుతున్న తమిళనాడులో శుక్రవారం రాజకీయంగా ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది. తమిళనాడులో విపక్ష పార్టీగా ఉన్న…
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి శుక్రవారంతో 10 మాసాలు గడిచాయి. గత ఏడాది జూన్ 12న ఏపీలో కూటమి సర్కారుకొలువు…
హర్యానా బీజేపీ ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ప్రముఖ రెజ్లర్, ప్రస్తుతం కాంగ్రెస్ ఎమ్మెల్యే…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇటీవలి రాప్తాడు పర్యటనపై సాగుతున్న మాటల యుద్ధంలో తాజాగా ఆ పార్టీ…
వైసీపీ నేత, హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యవహారం గురువారం ఎంత రచ్చగా మారిందో… శుక్రవారం కూడా అంతే…