ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్ల వ్యవహారం కొన్ని నెలలుగా ఎంతగా చర్చనీయాంశం అవుతోందో తెలిసిందే. ముందుగా తమ రాజకీయ ప్రత్యర్థి అయిన పవన్ కళ్యాణ్‌ను ఇబ్బంది పెట్టే క్రమంలో జగన్ సర్కారు వకీల్ సాబ్ సినిమా రిలీజ్ సందర్భంగా టికెట్ల ధరలపై నియంత్రణ తెచ్చిందన్నది బహిరంగ రహస్యం. ఒక రకంగా ఆ సినిమాకు ఇబ్బందులు కలిగించబోయి తేనె తుట్టెను కదిపినట్లే అయింది. తర్వాత ఈ వ్యవహారం మొత్తం ఇండస్ట్రీకే శాపంగా మారింది.
ఇప్పుడు ప్రతి సినిమా బిజినెస్‌లో దాదాపు 20 శాతం దెబ్బ తినే పరిస్థితి వచ్చింది. వసూళ్లు తగ్గుతున్నాయి. అందుకు తగ్గట్లే బిజినెస్ తగ్గుతోంది. జగన్ సర్కారు మనసు మార్చడానికి ఇండస్ట్రీ పెద్దలు ఎంత ప్రయత్నించినా కుదరడం లేదు. మధ్యలో పవన్ కళ్యాణ్ ఈ విషయంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా గట్టిగా మాట్లాడటంతో సమస్య మరింత జఠిలమైంది. ఐతే ప్రభుత్వం ఎంతకీ మెట్టు దిగకపోవడంతో ఇక నిర్మాతలో, డిస్ట్రిబ్యూటర్లో, లేదంటే ఎగ్జిబిటర్లో కోర్టును ఆశ్రయించక తప్పని పరిస్థితి నెలకొంది. చివరికి ఎగ్జిబిటర్లే ఆ పని చేశారు. కోర్టు టికెట్ల ధరలను నియంత్రిస్తూ ఇచ్చిన జీవోపై కోర్టు స్టే విధించింది.
దీంతో ఇండస్ట్రీ జనాలు హమ్మయ్య అనుకున్నారు. కానీ జగన్ పంతం ఎలాంటిదో తెలిసిందే. ఈ విషయాన్ని ఆయన కానీ, మంత్రులు కానీ తేలిగ్గా వదిలే అవకాశమే లేదు. అందుకే దీనిపై అప్పీల్‌కు ప్రభుత్వం సిద్ధమైంది. కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా టికెట్ల ధరలను పెంచడానికి వీల్లేదంటూ ఏపీలో స్థానికంగా అధికారులు ఆదేశాలు జారీ చేస్తుండటం గమనార్హం.
ఒకవేళ సుప్రీం కోర్టులో కూడా ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలినా.. ఈ విషయాన్ని అంత తేలిగ్గా వదలకపోవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తమ నిర్ణయాన్ని ధిక్కరించారన్న కోపంతో కొవిడ్ పేరు చెప్పి థియేటర్లలో మళ్లీ 50 పర్సంట్ ఆక్యుపెన్సీ తేవడం, కర్ఫ్యూ పేరుతో నైట్ షోలు రద్దు చేయడం.. లేదంటే థియేటర్ల మీద దాడులు చేయడం లాంటివి జగన్ సర్కారు చేయొచ్చనే అభిప్రాయాలు ఇండస్ట్రీ జనాల చర్చల్లో వ్యక్తమవుతున్నాయి.
This post was last modified on December 15, 2021 10:43 am
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…