‘పుష్ప’ సినిమాలో అల్లు అర్జున్ పెర్ఫామెన్స్‌కు నేషనల్ అవార్డు వస్తుందని ధీమా వ్యక్తం చేశాడు ఈ చిత్ర సంగీత దర్శకుడ దేవిశ్రీ ప్రసాద్. ఇది తాను ఊరికే యథాలాపంగా అంటున్న మాట కాదని.. ఈ సినిమా కోసం మేకోవర్ పరంగా, నటన పరంగా బన్నీ ఎంత కష్టపడ్డాడో.. సినిమాలో ఎలాంటి పెర్ఫామెన్స్ ఇచ్చాడో తనకు తెలుసని.. అందుకే అతడికి నేషనల్ అవార్డ్ వస్తుందని నమ్ముతున్నానని, రావాలని ఆకాంక్షిస్తున్నానని దేవి అన్నాడు.
‘పుష్ప’ చెన్నై ప్రెస్ మీట్లో దేవిశ్రీ ప్రసాద్ మాట్లాడుతూ.. ఈ సినిమాకు నేపథ్య సంగీతం అందించేటపుడు.. తాను చాలా సన్నివేశాలు చూసి ఆశ్చర్యపోయానని.. దర్శకుడు సుకుమార్, హీరో అల్లు అర్జున్ కలిసి అద్భుతం చేశారని అతనన్నాడు. ముఖ్యంగా ఒక యాక్షన్ సీక్వెన్స్ చూసి తనకు నోట మాటలు రాలేదని దేవి చెప్పాడు. బేసిగ్గా తనకు ఫైట్లంటే నచ్చవని.. కానీ ఈ సినిమాలో మాత్రం ఆ యాక్షన్ సీక్వెన్స్ చూసి తాను ఎంతగానో ఇంప్రెస్ అయ్యానని, ఆశ్చర్యపోయానని చెప్పాడు.
సుకుమార్ ఇలా ఎలా ఆలోచించాడో.. బన్నీ అలా ఎలా చేయగలిగాడో.. ఫైట్ మాస్టర్ దాన్ని అలా ఎలా తీర్చిదిద్దాడో తనకు అర్థం కాలేదన్నాడు. రీరికార్డింగ్ టైంలో ఆ సీక్వెన్స్ మళ్లీ మళ్లీ చూశానని.. ఇండియాలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్షన్ సీక్వెన్స్‌గా ఇది నిలిచిపోతుందని దేవి ధీమా వ్యక్తం చేశాడు.
ఇక బన్నీ తమిళంలో అడుగు పెట్టాలని అత్యంత కోరుకున్న వాళ్లలో తాను ముందుంటానని.. తన స్నేహితుడైన అతడితో ఎప్పుడు మాట్లాడినా తమిళంలో సినిమా చేయమని అడుగుతుండేవాడినని.. ఐతే ఇంత కాలానికి ‘పుష్ప’తో కోలీవుడ్లోకి బన్నీ ఎంట్రీ ఇస్తున్నాడని.. తమిళులకు బాగా కనెక్ట్ అయ్యే కథతో వస్తుండటం తనకు చాలా హ్యాపీగా ఉందని.. నిజానికి దీన్ని ఒక అనువాద చిత్రంగా తాను భావించట్లేదని.. అచ్చ తమిళ చిత్రం అనుకుంటున్నానని.. కచ్చితంగా ఈ సినిమా ఇక్కడ సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని దేవి అన్నాడు.
This post was last modified on December 14, 2021 7:10 pm
జాతీయ పురాతన పార్టీ కాంగ్రెస్‌లో అంతర్గతంగా భారీ కలకలం రేగినట్టు తెలుస్తోంది. ఇద్దరు కీలక నాయకుల మధ్య వివాదాలు తారస్థాయికి…
గత ఏడాది హనుమాన్ బ్లాక్ బస్టర్ సాధించాక దర్శకుడు ప్రశాంత్ వర్మ కొత్త సినిమా ఇప్పటిదాకా ప్రారంభం కాలేదు. జై…
దిగ్గజ నటి, మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణానంతరం ఆమె మీద సినిమాలు, వెబ్ సిరీస్‌లు తీయడానికి ఒక సమయంలో ఫిలిం…
తక్కువ సినిమాలతోనే తమిళంలో గ్రేట్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న గౌతమ్ మీనన్ కొన్నేళ్ల నుంచి కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…
కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనాయకుడు అమిత్ షా నాలుగు రోజుల కిందట ఏపీలో పర్యటించా రు. విజయవాడ…
రాజకీయాల్లో ఉన్నవారు.. ఆచి తూచి అడుగులు వేయాలి. ఎన్నికల సమయంలో ఎలాంటి మాటలు చె ప్పినా.. ప్రజలను తమవైపు తిప్పుకొనేందుకు…