ప్రభాస్ చేతిలో ఉన్న ప్రెస్టీజియస్ ప్రాజెక్టుల్లో ‘ప్రాజెక్ట్-కె’ ఒకటి. ‘మహానటి’ దర్శకుడు నాగ్ అశ్విన్, లెజెండరీ ప్రొడ్యూసర్ అశ్వినీదత్‌లతో కలిసి ప్రభాస్ చేస్తున్న ఈ చిత్రం ఇటీవలే సెట్స్ మీదికి వెళ్లింది. ఇది ఇండియాలోనే బిగ్గెస్ట్ బడ్జెట్లో తెరకెక్కబోతున్న చిత్రంగా చెబుతున్నారు. దాదాపు రెండేళ్ల పాటు ప్రి ప్రొడక్షన్ చేశారంటే ఈ సినిమా స్థాయి ఏంటో అర్థం చేసుకోవచ్చు. దాదాపు రూ.500 కోట్ల ఖర్చుతో ఈ సినిమా తెరకెక్కనుందని అంటున్నారు.
ఇలాంటి మెగా ప్రాజెక్టుకు దానికి స్థాయిలోనే టెక్నీషియన్లను తీసుకుంటారని అనుకున్నారు. ఐతే ‘ప్రాజెక్ట్-కె’కు సంగీత దర్శకుడిగా మిక్కీ జే మేయర్‌ను ఎంచుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. మిక్కీ ప్రతిభను తక్కువ చేయడం కాదు కానీ.. అతను ఈ స్థాయి భారీ చిత్రాలకు ఇప్పటిదాకా పని చేసింది. లేదు. ఈ రేంజ్ అనే కాదు.. ఇప్పటిదాకా పెద్ద హీరోల సినిమాలకే వర్క్ చేయలేదు.
ఐతే ‘మహానటి’కి అద్భుతమైన పాటలు, నేపథ్య సంగీతం అందించి సినిమాకు ప్రాణం పోయడంతో మిక్కీ మీద నమ్మకంతో నాగ్ అశ్విన్.. అతణ్ని ‘ప్రాజెక్ట్-కె’ కోసం ఎంచుకున్నాడు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు కూడా. ఐతే తర్వాత చిత్ర బృందం ఆలోచన మారిందని.. ఇలాంటి భారీ సినిమా స్థాయికి తగ్గట్లు పెద్ద సంగీత దర్శకుడిని ఎంచుకోవాలని చూస్తున్నారని.. మిక్కీని తప్పిస్తున్నారని వార్తలొచ్చాయి. కానీ ఆ ప్రచారం నిజం కాదని తేలింది. తన సంగీత దర్శకత్వంలో రాబోతున్న కొత్త సినిమా ‘శ్యామ్ సింగ రాయ్’ ప్రమోషన్ల కోసం మీడియాను కలిసిన మిక్కీ.. తన ఫ్యూచర్ ప్రాజెక్టుల్లో ఒకటిగా ‘ప్రాజెక్ట్-కె’ను పేర్కొన్నాడు.
ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని.. ఐతే ఈ సినిమా సంగీత చర్చలు ఇంకా మొదలు కాలేదని వెల్లడించాడు. కాబట్టి మిక్కీనే ఈ మెగా మూవీకి సంగీత దర్శకుడిగా కొనసాగబోతున్నాడన్నమాట. ‘మహానటి’కి పని చేసిన స్పానిష్ సినిమాటోగ్రాఫర్ డానీ సాంచెజ్‌యే ఈ చిత్రానికి కూడా సినిమాటోగ్రఫీ అందిస్తున్నాడు. ఈ సినిమా కోసం ప్రపంచంలోనే అతి పెద్ద కెమెరాను ఉపయోగిస్తున్న సంగతి తెలిసిందే.
This post was last modified on December 14, 2021 6:18 pm
రెండు రోజులుగా సౌత్ ఇండియన్ ఫిలిం సర్కిల్స్‌లో ధనుష్-నయనతార గొడవ గురించే చర్చలన్నీ నడుస్తున్నాయి. తన పెళ్లి, వ్యక్తిగత జీవితం…
ప్రపంచమంతటా ప్రతిష్ఠత కలిగిన మిస్ యూనివర్స్ పోటీల్లో ఈసారి డెన్మార్క్‌కు చెందిన విక్టోరియా కెజార్ హెల్విగ్ ఘనవిజయం సాధించారు. మెక్సికోలో…
సండే ఈజ్ ఏ హాలీడే కాబట్టి… ఆ మూడ్‌లోకి వెళుతూ ప్రజలంతా రిలాక్స్ మూడ్‌లోకి వెళ్తుంటే… రాజకీయ నాయకులు మాత్రం…
దేశ రాజధాని ఢిల్లీ రాజకీయాలు మరోసారి హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఒకప్పుడు బెస్ట్ లీడర్ అంటూ పొగిడిన సొంత…
ట్రెడిషనల్ హీరోయిన్ అనే ముద్ర నుంచి గ్లామర్ క్వీన్ ఇమేజ్ వైపు శరవేగంగా అడుగులేస్తున్న కథానాయిక కీర్తి సురేష్. దక్షిణాదిన…
https://youtu.be/g3JUbgOHgdw?si=jpCbsxB5cP_qeRwA ఇతర రాష్ట్రాల్లో ప్రభాస్ కాకుండా ఒక తెలుగు హీరోకి ఇంత క్రేజ్ ఏమిటాని అందరూ ఆశ్చర్యపోయే రీతిలో పుష్ప…