రెండు రోజుల కిందటే ‘పుష్ప’ మూవీ నుంచి ‘ఊ అంటావా ఉఊ అంటావా మావా’ అంటూ ఒక పాటను లాంచ్ చేశారు. ఇక అప్పట్నుంచి సోషల్ మీడియాలో ఈ పాట మోతెక్కిపోతోంది. సిజ్లింగ్ సాంగ్ ఆఫ్ ద ఇయర్ అనే టైటిల్‌తో పాటను రిలీజ్ చేయగా.. ఆ ట్యాగ్‌కు తగ్గట్లే ఈ పాట సోషల్ మీడియాను ఊపేస్తోంది. కేవలం 24 గంటల వ్యవధిలో 1.4 కోట్ల వ్యూస్, 10 లక్షలకు పైగా లైక్స్‌తో ఈ పాట యూట్యూబ్‌ను షేక్ చేసేసింది.
సౌత్ ఇండియాలో 24 గంటల వ్యవధిలో అత్యధిక మంది వీక్షించిన పాటగా ఇది రికార్డ్ సృష్టించింది. ‘పుష్ప’ మీద ఉన్న అంచనాలకు తోడు సమంతతో ఐటెం సాంగ్ అనేసరికి ఈ పాటపై ప్రత్యేక ఆసక్తి నెలకొన్న మాట వాస్తవం. అలాగే సుకుమార్-దేవిశ్రీ ప్రసాద్ కాంబినేషన్ అంటే ఐటెం సాంగ్ మీద అంచనాలు భారీగానే ఉంటాయి. ఇక వీరికి బన్నీ కూడా తోడయ్యాడు. కాబట్టి ఈ పాట రిలీజ్‌కు ముందే హైప్ వచ్చింది.
కానీ అంచనాలను మించిపోయి ఈ రేంజిలో పాటకు రెస్పాన్స్ వస్తుందని.. సోషల్ మీడియాను ఇంతలా ఈ పాట షేక్ చేస్తుందని ఊహించలేదు. అలాగని ఈ పాట విషయంలో విమర్శలు లేవా అంటే అలా ఏమీ కాదు. సుక్కు-దేవి సినిమాల్లో ఇంతకుముందు వచ్చిన పాటల స్థాయిలో ఇందులో ఊపు లేదని కొందరంటుంటే.. సాహిత్యం మరీ శ్రుతి మించిందని.. ఒక బూతు పాటలా ఉందని ఇంకొందరంటున్నారు. సమంత విషయంలోనూ మిశ్రమ స్పందన వచ్చింది.
విడాకుల తర్వాత ఈ పాటలో కొంచెం హద్దులు దాటి ఎక్స్‌పోజింగ్ చేయడం పట్ల విమర్శలూ వచ్చాయి. మరోవైపు ఈ పాట ‘వీడొక్కడే’ సినిమాలోని ‘హనీ హనీ’ పాటకు కాపీ అనే అభిప్రాయాలు కూడా వ్యక్తమయ్యాయి. ఐతే ఎవరెన్ని విమర్శలు చేసినా.. ఈ పాట ఒక సెన్సేషన్ అనడంలో సందేహం లేదు. ఆల్రెడీ ‘ఊ అంటావా ఉఊ అంటావా మావా’ అనే హుక్ లైన్ జనాల నోళ్లలో బాగా నానుతోంది. పాటను మళ్లీ మళ్లీ వింటున్నారు. చూస్తున్నారు. రేప్పొద్దున సినిమా రిలీజయ్యాక ఈ పాట మరింత ఊపేయడం ఖాయం.
This post was last modified on December 12, 2021 9:14 pm
టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ గా పేరున్న మైత్రి మూవీ మేకర్స్ గత ఏడాది అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ…
క్రిస్మస్ రిలీజ్ వదులుకున్నందుకు రాబిన్ హుడ్ విషయంలో నితిన్ బాగా అసహనంతో ఉన్నట్టు సన్నిహిత వర్గాల సమాచారం. వెంకీ కుడుముల…
నూతన సంవత్సరం సందర్భంగా విజయవాడ కనకదుర్గమ్మను ఏపీ సీఎం చంద్రబాబు దర్శించుకున్నారు. ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలతోపాటు దేశ ప్రజలకు…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దగ్గర వైసీపీ అధినేత జగన్‌కు ప్రత్యేక ముద్ర ఉన్న విషయం తెలిసిందే. ఒకానొక సందర్భంలో…
హమ్మయ్యా విడాముయర్చి పోటీ తప్పింది కదాని మెగా ఫ్యాన్స్ సంతోషపడుతున్నారు కానీ పోటీ రూపంలో ఉన్న సమస్య పూర్తిగా తగ్గలేదన్నది…
మచిలీపట్నంలో పేర్ని నానికి చెందిన గోడౌన్ లో రేషన్ బియ్యం మాయం కేసు విచారణ వేగవంతమైంది. ఈ కేసులో ఏ1గా…