ఇటు సౌత్‌లో చూసినా అటు నార్త్‌లో చూసినా స్టార్ హీరోల సినిమాలకి ఫస్ట్ ప్రిఫరెన్స్ పూజా హెగ్డేనే. అందుకే ఒకదాని తర్వాత ఒకటిగా బిగ్ ప్రాజెక్ట్స్‌ని బ్యాగ్‌లో వేసుకుంటూ జెట్ స్పీడులో దూసుకెళ్లిపోతోందామె. ఆ క్రేజీ ప్రాజెక్టుల్లో బీస్ట్ ఒకటి. విజయ్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది పూజ.
కొన్నాళ్లుగా ఈ సినిమా షూటింగ్ నాన్‌స్టాప్‌గా జరుగుతోంది. తెలుగు, హిందీ చిత్రాలతో పాటే ఈ సినిమా షూటింగ్‌లోనూ పాల్గొంటోంది పూజ. ఇవాళ తన పోర్షన్‌ని పూర్తి చేసేసింది కూడా. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ అఫీషియల్‌గా ప్రకటించింది. ఈ సందర్భంగా ఓ ఈ వీడియోను కూడా రిలీజ్ చేశారు.
ఇందులో బీస్ట్ మూవీతో తన జర్నీ గురించి మాట్లాడింది పూజ. షూటింగ్ జరిగినన్నాళ్లూ ఓ పిక్నిక్‌లో ఉన్నట్టు అనిపించిందని, చాలా ఎంజాయ్ చేశానని చెప్పింది. విజయ్ యాక్టింగ్ స్టైల్, నెల్సన్ దిలీప్ కుమార్ టేకింగ్ స్టైల్ అందరినీ ఎంటర్‌టైన్ చేస్తాయని కూడా చెప్పింది. త్వరలోనే థియేటర్‌లో కలుద్దాం అంటూ నవ్వులు రువ్వి మురిపించింది.
నిజానికి తమిళ చిత్రంతోనే తన కెరీర్‌ని స్టార్ట్ చేసింది పూజ. కానీ ఆ తర్వాత తెలుగులో ఫుల్ బిజీ అయిపోయింది. మళ్లీ ఇన్నాళ్లకి కోలీవుడ్‌లో అడుగు పెట్టింది. అయితే ఈసారి స్టార్ హీరోయిన్ స్టేటస్‌లో వెళ్లింది. ఈ సినిమా కనుక సక్సెస్ అయితే అక్కడ మిగతా స్టార్స్ కూడా పూజనే ప్రిఫర్ చేస్తారనడంలో సందేహం లేదు.
This post was last modified on December 12, 2021 12:14 pm
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…