Movie News

బాలయ్యకు ఎదురు లేదు

బాలయ్యకు ఎదురు లేదునందమూరి బాలకృష్ణకు బాక్సాఫీస్ దగ్గర మామూలుగా కలిసి రావట్లేదిప్పుడు. కరోనా బ్రేక్ తర్వాత మంచి మాస్ సినిమా కోసం చాలా కాలం నుంచి ప్రేక్షకులు ఎదురు చూస్తున్న టైంలో విడుదల కావడం ‘అఖండ’కు బాగా కలిసొచ్చింది. బోయపాటితో బాలయ్య కాంబినేషన్ మీద ఉన్న గురి వల్ల ఈ సినిమాకు అనూహ్యమైన క్రేజ్ వచ్చింది. టాక్ మరీ గొప్పగా లేకపోయినా ఈ చిత్రానికి తొలి వారాంతంలో వసూళ్ల మోత మోగింది.

బాలయ్య కెరీర్లో హైయెస్ట్ రికార్డులన్నింటినీ బద్దలు కొట్టుకుంటూ ఈ చిత్రం ముందుకు వెళ్తోంది. వీకెండ్ తర్వాత కూడా ఈ చిత్రానికి చాలా చోట్ల హౌస్ ఫుల్స్ పడటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. వీకెండ్లో అయితే సినిమా జోరు గురించి ఎంత చెప్పినా తక్కువే. ఐతే ఏ సినిమా అయినా.. రెండో వారంలోకి వచ్చేసరికి జోరు తగ్గించేయడం.. కొత్త సినిమాలు లీడ్ తీసుకోవడం మామూలే. కానీ ‘అఖండ’కు అలాంటి అడ్డంకులేమీ కనిపించడం లేదు.

ఈ శుక్రవారం నాగశౌర్య ‘లక్ష్య’, శ్రియ సరన్ ‘గమనం’ చిత్రాలు రిలీజయ్యాయి. వీటితో పాటు కొన్ని చిన్న సినిమాలు కూడా బరిలోకి దిగాయి. కానీ ఇవేవీ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించినట్లుగా కనిపించడం లేదు. ‘లక్ష్య’ మాస్ టచ్ ఉన్న సినిమానే అయినా.. ఎందుకో దీనిపై ప్రేక్షకులు ఆసక్తి చూపించట్లేదు. ఉదయం మార్నింగ్ షోలకు థియేటర్లు వెలవెలబోయాయి. నాగశౌర్య గత సినిమాల ప్రభావం వల్లో.. ప్రమోషన్ సరిగా లేకపోవడం వల్లో.. కారణమేదైనా కానీ.. ‘లక్ష్య’ డల్ నోట్‌తో మొదలైంది. దీనికి తోడు బ్యాడ్ టాక్ రావడం కూడా దీనికి చేటు చేసేలా కనిపిస్తోంది.

మరోవైపు ‘గమనం’ చిత్రానికి అస్సలు బజ్ లేదు. పైగా ఈ సినిమాకు ముందు రోజు వేసిన ప్రిమియర్ షో నుంచి నెగెటివ్ టాక్ వచ్చింది. దీంతో ఈ సినిమా థియేటర్లు కూడా తొలి రోజే వెలవెలబోతున్నాయి. మిగతా సినిమాల గురించి చెప్పడానికేమీ లేదు. చూస్తుంటే ఈ పరిస్థితి ‘అఖండ’కు బాగానే కలిసొచ్చేలా ఉంది. రెండో వీకెండ్లోనూ ఈ సినిమా మంచి వసూళ్లు రాబట్టేలా కనిపిస్తోంది. ఈ రోజు సాయంత్రానికి శని, ఆదివారాలకు అడ్వాన్స్ బుకింగ్స్ ఆశాజనకంగా ఉన్నాయి. ‘పుష్ప’ వచ్చే వరకు ఈ సినిమాకు ఎదురు లేనట్లే.

This post was last modified on December 11, 2021 2:40 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

బైడెన్ వ‌ర్సెస్ ట్రంప్‌.. న‌లిగిపోతున్న విదేశీయులు!

అగ్ర‌రాజ్యం అమెరికాలో చోటు చేసుకున్న ప‌రిణామాలు.. విదేశీ విద్యార్థులు, వృత్తి నిపుణుల‌ను ఇర‌కాటంలోకి నెడుతున్నాయి. మ‌రో రెండు మూడు వారాల్లోనే…

7 hours ago

ఆ ఖైదీ జైలు శిక్ష‌ ఫిఫ్టీ-ఫిఫ్టీ.. భార‌త్‌, బ్రిట‌న్ ఒప్పందం!

జైలు శిక్ష ఏమిటి? అందులోనూ ఫిఫ్టీ-ఫిఫ్టీ ఏమిటి- అనే ఆశ్చ‌ర్యం అంద‌రికీ క‌లుగుతుంది. కానీ, ఇది వాస్త‌వం. దీనికి సంబంధించి…

8 hours ago

‘టీడీపీ త‌లుపులు తెరిస్తే.. వైసీపీ ఖాళీ’

ఏపీలో రాజ‌కీయ వ్యూహాలు, ప్ర‌తివ్యూహాలు ఎలా ఉన్నా.. అధికార పార్టీ నాయ‌కులు చేస్తున్న వ్యాఖ్య‌లు మాత్రం కాక పుట్టిస్తున్నాయి. ఇప్ప‌టికే…

9 hours ago

18 ఏళ్ల త‌ర్వాత‌ ప‌రిటాల ర‌వి హ‌త్య కేసులో బెయిల్

టీడీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ మంత్రి ప‌రిటాల ర‌వి గురించి యావ‌త్ ఉమ్మ‌డి రాష్ట్రానికి తెలిసిందే. అన్న‌గారు ఎన్టీఆర్ పిలుపుతో…

10 hours ago

మహేష్ ఫ్యాన్స్ ఓన్ చేసుకున్నారు.. జర భద్రం!

క్రిస్మస్‌కు తెలుగులో భారీ చిత్రాల సందడి ఉంటుందని అనుకున్నారు కానీ.. ఈ సీజన్లో వస్తాయనుకున్న గేమ్ చేంజర్, తండేల్, రాబిన్…

12 hours ago