సమంత ఇన్నేళ్ల కెరీర్లో ఏవో కొన్ని సినిమాల్లో కొంత గ్లామరస్‌గా కనిపించిందే తప్ప.. చాలామంది స్టార్ హీరోయిన్ల లాగా వీర లెవెల్లో ఎక్స్‌పోజింగ్ అయితే చేయలేదు. కెరీర్ ఆరంభంలో ఏమాయ చేసావెలో లిప్ లాక్ చేసింది కానీ.. ఆ తర్వాత ముద్దు సీన్లకు కూడా నో చెబుతూనే వచ్చింది. రంగస్థలంలో లిప్ లాక్ ఉన్నప్పటికీ.. అది గ్రాఫిక్ అనే క్లారిటీ వచ్చింది.
ఇక సమంత క్లీవేజ్ షోలు చేయడం, అందాలు ఆరబోయడం చాలా అరుదు. కానీ నాగచైతన్య నుంచి విడిపోయి ఒంటరి అయిపోగానే సమంతకు కొత్తగా రెక్కలొచ్చినట్లే కనిపిస్తోంది. విడాకుల తర్వాత ఆమె పుష్ప మూవీలో ఐటెం సాంగ్ చేయడానికి ఒప్పుకున్న సంగతి తెలిసిందే. ఇన్నేళ్లలో ఎప్పడూ ఐటెం సాంగ్ చేయని సామ్.. తొలి పాటలోనే ఓ రేంజ్‌లో అందాలు ఆరబోసేసిందని ఈ రోజు రిలీజ్ చేసిన లిరికల్ వీడియోతోనే అర్థమైపోయింది.
వీడియో దృశ్యాలేమీ లేకుండా కేవలం ఫొటోలు మాత్రమే చూపించారు కానీ.. వాటిలో సమంత క్లీవేజ్ అందాల ఆరబోత చూసి అంతా షాకైపోయారు. సమంతలో ఇంత సెక్సప్పీల్ ఎప్పుడూ చూడలేదనే అభిప్రాయాలు వ్యక్తమవతున్నాయి. వివాహ బంధం నుంచి వేరుపడేసరికి సమంతకు ఎక్కడ లేని స్వేచ్ఛ వచ్చేసినట్లుందని.. ఏ పరిమితులూ పెట్టుకోకుండా అందాలు ఆరబోసేసిందని సోషల్ మీడియాలో జనాలు చర్చించుకుంటున్నారు.
దీని మీద నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పాటలో సాహిత్యం కూడా హద్దులు మించి ఉండటం.. అందుకు తగ్గట్లే సమంత కెరీర్లో ఎన్నడూ లేనంత సెక్సీగా కనిపించడం హాట్ టాపిక్‌గా మారింది. కేవలం లిరికల్ వీడియోకే ఇంత రచ్చ అంటే.. ఇక సినిమాలో పూర్తి పాట చూశాక జనాల స్పందన ఎలా ఉంటుందో చూడాలి.
This post was last modified on December 11, 2021 9:36 am
రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…
పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…