అఖండ’ సినిమాతో టాలీవుడ్ బాక్సాఫీస్‌లో బాగానే వేడి పుట్టింది. రాబోయే భారీ చిత్రాలన్నింటికీ ఇది మంచి ఉత్సాహాన్నిచ్చింది. ‘అఖండ’ తర్వాత అందరి దృష్టినీ ఆకర్షిస్తున్న చిత్రం ‘పుష్ప’. ఈ నెల 17న ఆ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కొన్ని రోజుల కిందటే ట్రైలర్ లాంచ్ చేయగా.. అది సినిమాపై అంచనాలను పెంచింది. ఇప్పటిదాకా తెలుగు సినిమాల్లో ఎన్నడూ చూడని ఎర్రచందనం బ్యాక్ డ్రాప్‌లో సినిమా తెరకెక్కడమే ఈసినిమాలో యునీక్ పాయింట్.
ఇక ‘పుష్ప’ కోసం అదిరిపోయే మేకోవర్‌లోకి మారిన బన్నీ.. తన పవర్ ఫుల్ పెర్ఫామెన్స్‌తో అదరగొట్టేస్తాడని.. అతడి పెర్ఫామెన్స్‌కు సుకుమార్ బ్రిలియన్స్ తోడైతే సినిమాకు ఒక రేంజ్ ఫలితం వస్తుందని ఆశిస్తున్నారు. ఐతే పాన్ ఇండియా లెవెల్లో భారీ స్థాయిలో రిలీజ్ కాబోతున్న ఈ చిత్రానికి ప్రమోషన్ల పరంగా ఇప్పుడు పెద్ద చిక్కొచ్చి పడింది.‘పుష్ప’ ట్రైలర్ లాంచ్ అయినప్పటి నుంచి రిలీజ్ వరకు చర్చలన్నీ ఈ సినిమా చుట్టూనే తిరుగుతాయనుకుంటే.. మధ్యలో ‘ఆర్ఆర్ఆర్’ వచ్చి పడింది. ఆ సినిమా ట్రైలర్ లాంచ్ నేపథ్యంలో ముందు రోజు నుంచే ఫోకస్ అంతా అటు షిప్ట్ అయిపోయింది.
ట్రైలర్ లాంచ్ రోజు దేశవ్యాప్తంగా డిస్కషన్లన్నీ దీని చుట్టూనే తిరిగాయి. ట్రైలర్ హ్యాంగోవర్ నుంచి తర్వాతి రోజుకు కూడా జనాలు బయటికి రాలేదు. అది చాలదన్నట్లు గురువారం అనుకున్న హైదరాబాద్ ప్రెస్ మీట్ అనుకోకుండా రద్దయింది. రెండు రోజుల తర్వాత మళ్లీ ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు. అందులో రాజమౌళితో పాటు తారక్, చరణ్ కూడా పాల్గొంటారు. ఇక ఆ రోజంతా కూడా ‘ఆర్ఆర్ఆర్’ చర్చలే ఉంటాయి. ‘పుష్ప’ రిలీజ్ ముంగిట ‘ఆర్ఆర్ఆర్’ టీం ఇలా హడావుడి చేయడంతో దాని మీద ఫోకస్ ఉండట్లేదు.
నిజానికి ‘ఆర్ఆర్ఆర్’ ట్రైలర్ ఈ నెల 3కు షెడ్యూల్ అవగా.. మూడు రోజుల గ్యాప్‌తో ‘పుష్ప’ ట్రైలర్ పెట్టుకున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ గురించి రెండు మూడు రోజులు చర్చ జరిగినా అక్కడి నుంచి ‘పుష్ప’ పైకి ఫోకస్ మళ్లుతుందనుకున్నారు. కానీ ‘ఆర్ఆర్ఆర్’ ట్రైలర్ లాంచ్ వాయిదా పడి.. ఇప్పుడు అది ‘పుష్ప’ టైంను తినేస్తోంది. అందులోనూ ‘పుష్ఫ’తో పోలిస్తే ‘ఆర్ఆర్ఆర్’ ట్రైలర్ ఒక రేంజ్‌లో ఉండటం కూడా దీనికి ప్రతికూలంగా మారింది.
This post was last modified on December 10, 2021 2:14 pm
రాయలసీమలో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్(ఐఎస్ ఏ) ఏర్పాటుకు భూమి పూజ జరిగిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో ప్రముఖ…
దక్షిణాది సినీ పరిశ్రమను తీవ్ర విషాదంలో ముంచెత్తుతూ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు శాశ్వత సెలవు తీసుకున్నారు. టాలీవుడ్ పునాదుల నుంచి…
సాధారణంగా ఒక భాషలో విజయవంతమైన సినిమాను మళ్లీ రీమేక్ చేసి అంత మంచి ఫలితం రాబట్టడం అంత తేలిక కాదు.…
ఏ భాష అయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ పెంచేది సక్సెసే. ఇందులో వేరే డిబేట్ లేదు. ఎన్ని హిట్లు పడ్డాయనే…
కింగ్ నాగార్జున కెరీర్ లో చాలా కీలకమైన మైలురాయి వందో సినిమా. కింగ్ 100 టైటిల్ తో రూపొందుతున్న ఈ…
ఇంట్లోనే కాదు ఇండస్ట్రీలో కూడా కొన్ని మొహమాటాల మీద జరుగుతాయి. పాత బాకీ ఉందని ఒక సినిమా ఒప్పుకోవాల్సి వస్తుంది.…