కొన్ని వారాలుగా దేశమంతా కత్రినా కైఫ్ పెళ్లి గురించి చర్చించినంతగా మరే విషయం గురించీ చర్చించలేదంటే అతిశయోక్తి కాదేమో. పెళ్లి చేసుకుంటున్నామని కనీసం అనౌన్స్ కూడా చేయలేదు కత్రినా, విక్కీ కౌశల్. అయినా కూడా విషయాలు బైటికి పొక్కాయి. వైరల్ అయ్యాయి. ఈ రోజు రాత్రి ఆ జంట ఒక్కటి కాబోతున్నా ఇంకా చర్చలు నడుస్తూనే ఉన్నాయి.
పెళ్లి ఏర్పాట్ల దగ్గర్నుంచి గెస్ట్ లిస్టుల వరకు చాలా ఇంటరెస్టింగ్ విషయాలు బయటికొచ్చాయి ఇప్పటివరకు. అయితే ఇప్పుడు మరో ఆసక్తికరమైన విషయం తెలిసింది. తమ పెళ్లి ఖర్చులో డెబ్భై అయిదు శాతం కత్రినాయే పెట్టుకుంటోందట. ఈ వార్త ఎంతవరకు నిజమో తెలీదు కానీ నెట్‌లో మాత్రం తెగ చక్కర్లు కొడుతోంది. భోజనాలు, సెక్యూరిటీ ఏర్పాట్లు, అతిథుల విడిది లాంటివన్నీ కత్రినాయే చూసుకుదట..
అయితే విశేషమేమిటంటే.. పెళ్లికి అతి ముఖ్యమైన ఖర్చు మాత్రం వీరికి తప్పిపోయింది. రాజస్థాన్‌లోని సిక్స్ సెన్సెస్ ఫోర్ట్‌లో వీరి వివాహం జరుగుతోంది. కానీ దానికి ఒక్క పైసా కూడా వీరు చెల్లించడం లేదు. యాజమాన్యం ఫ్రీగా కోటను ఇచ్చింది. కరోనా వల్ల సంక్షోభంలో చిక్కుకున్న రాజస్థాన్ పర్యాటక రంగాన్ని మళ్లీ అభివృద్ధి చేయడానికి ఇది పబ్లిసిటీగా పనికొస్తుందని వాళ్లు ఫీలయ్యారట.
అందుకే డబ్బు చెల్లించక్కర్లేదని, హ్యాపీగా పెళ్లి చేసుకోమని అనుమతిచ్చారట. మూడు రోజుల నుంచి జరుగుతున్న పెళ్లి సందడి ఇవాళ పీక్స్‌కి చేరుకుంది. మధ్యాహ్నం మూడింటి నుంచి సెహ్‌రా బంధీ సెర్మనీ జరిగింది. రాత్రికి మాంగల్య ధారణ జరగనుంది. ఇండస్ట్రీ నుంచి కొందరు ప్రముఖులకు మాత్రమే ఆహ్వానం అందించింది. తనని నటిగా నిలబెట్టిన ‘మల్లీశ్వరి’ సినిమా హీరో వెంకటేష్‌ని కూడా కత్రినా ఇన్వైట్ చేసిందని టాక్.
This post was last modified on December 9, 2021 9:39 pm
సోషల్ మీడియా ప్రపంచంలో నెగటివిటీ ఎంతగా పెరిగిపోయిందంటే గాలి కన్నా వేగంగా ఇదే ప్రయాణిస్తోంది. కొందరి ఆలోచనలను, వ్యక్తిత్వాలను తీవ్రంగా…
పన్నెండు సంవత్సరాలు ఒక సినిమా విడుదల కాకుండా ల్యాబ్ లో మగ్గితే దాని మీద ఎవరికీ పెద్దగా ఆశలు ఉండవు.…
ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్‌తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…