‘ఆర్ఆర్ఆర్’ ట్రైలర్ రిలీజైంది. ఎప్పట్లాగే జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ అభిమానుల మధ్య వాదోపవాదాలు నడుస్తున్నాయి. ఇద్దరు హీరోలకూ వేర్వేరుగా హైరేంజ్ ఎలివేషన్ షాట్లు పెట్టిన రాజమౌళి.. ఓవరాల్‌గా చూస్తే తారక్‌ను కొంచెం తక్కువ చేసి చూపించాడని, క్యారెక్టర్ పరంగా రామ్ చరణే కొన్ని రకాలుగా పైచేయి సాధించాడని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే లుక్స్ విషయంలోనూ తారక్ కంటే చరణ్ మెరుగ్గా కనిపించాడు. అలాగని దీన్ని బట్టి ముందే ఒక అంచనాకు రావడం తప్పు.
రాజమౌళి ఉద్దేశపూర్వకంగా తారక్‌ను తక్కువ చేస్తాడని అస్సలు అనుకోలేం. ఇంకా చెప్పాలంటే తారక్ మీద ఆయనకు ప్రేమ ఎక్కువే. సినిమాలో కొంచెం తారక్‌నే హైలైట్ చేసినా ఆశ్చర్యం లేదు. ట్రైలర్ చూసి ఇలాంటి అభిప్రాయాలు కలగడానికి ఆయా పాత్రల స్వభావం ఒక కారణమన్నది అర్థం చేసుకోవాల్సిన విషయం. ‘ఆర్ఆర్ఆర్’లో చరణ్ చేసింది సీతారామరాజు పాత్ర. బేసిగ్గానే తెలుగు వాళ్లకు అదొక ఐకానిక్ క్యారెక్టర్. లుక్ పరంగా ఒక చాలా ఆకర్షణ ఉన్న పాత్ర అది. అల్లూరి సీతారామరాజు సినిమాతో ఆ పాత్రతో బాగా కనెక్ట్ అయి ఉన్నారు ప్రేక్షకులు.
అల్లూరి ఆహార్యం ఎంతో ఆకట్టుకునేలా ఉంటుంది కూడా. రామ్ చరణ్ ఆ పాత్రనే చేయడంతో లుక్స్ పరంగా హైలైట్ అయ్యాడు. అలాగే అతను చేసింది పోలీస్ క్యారెక్టర్ కావడం, అందుకోసం ఫిజిక్ పెంచడంతో ఆ రకంగానూ హైలైట్ అయ్యాడు. అలాగే పాత్ర కూడా ఆధిపత్యంతో కనిపించింది. కానీ తారక్ చేసింది కొమరం భీమ్ క్యారెక్టర్. అది ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసి దాచుకుని తిరిగే గోండు వర్గానికి చెందిన పాత్ర. అందుకు తగ్గట్లే ఆ క్యారెక్టర్‌ను డిజైన్ చేశారు.
దీంతో ఆ పాత్ర డామినేషన్ ట్రైలర్లో కనిపించలేదు. లుక్స్ పరంగా కూడా తారక్ వెనుకబడ్డట్లు కనిపిస్తుంది. కానీ ఇదంతా పాత్ర శైలికి తగ్గట్లుగా చేసిన సెటప్. ట్రైలర్ చూసి ఏదో అనుకోవచ్చు కానీ.. సినిమాలో కథ ప్రధానంగా తారక్ చుట్టూ తిరిగేలా కనిపిస్తోంది. అలాగే ఎమోషన్లలో తారకే హైలైట్ అయ్యేలా కనిపిస్తున్నాడు. కాబట్టి యాక్షన్ పార్ట్, లుక్స్ పరంగా చరణ్ డామినేషన్ ఉన్నప్పటికీ ఎమోషన్లలో తారక్ ముద్ర కనిపిస్తుందని.. నటన పరంగా అతను హైలైట్ అవుతాడని భావిస్తున్నారు. ఈ బ్యాలెన్స్ పాటించడంలో జక్కన్నను మించిన వాళ్లు ఎవరుంటారు మరి?
This post was last modified on December 9, 2021 8:27 pm
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…