టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత విడాకుల తరువాత వరుస సినిమాలు ఒప్పుకుంటుంది. గుణశేఖర్ దర్శకత్వంలో ‘శాకుంతలం’ సినిమాను పూర్తి చేసిన ఈ బ్యూటీ శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై ఓ సినిమా చేస్తోంది. శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తోన్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఇటీవలే మొదలైంది. దీనికి ‘యశోద’ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారు. హరి, హరీష్ అనే ఇద్దరు దర్శకులు ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. వీరిద్దరూ కొత్త దర్శకులు అయినప్పటికీ.. వారు కథ చెప్పిన వెంటనే సమంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
కథను అంత ఇంట్రెస్టింగ్ పాయింట్ తో రాసుకున్నారట. ఇదొక సైంటిఫిక్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో నడుస్తుందని సమాచారం. అంతేకాదు.. సినిమాలో సూపర్ నేచురల్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయట. ఇందులో హీరో క్యారెక్టర్ అనేది ఉండదు. హీరో, హీరోయిన్ అన్నీ సమంతనే. అయితే ఓ ముఖ్య పాత్ర కోసం మాత్రం కోలీవుడ్ బ్యూటీ వరలక్ష్మీ శరత్ కుమార్ ను ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది.
సినిమాలో ఆమె క్యారెక్టర్ చాలా స్పెషల్ గా ఉంటుందని చెబుతున్నారు. ఈ మధ్యకాలంలో తెలుగులో వరలక్ష్మీకి డిమాండ్ బాగా పెరిగింది. క్రేజీ ప్రాజెక్ట్ ల కోసం ఆమెని సంప్రదిస్తున్నారు. ఇప్పుడు సమంతతో స్క్రీన్ షేర్ చేసుకోబోతుంది.
ఈ సినిమాను తెలుగులోనే కాకుండా.. తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. మణిశర్మ ఈ సినిమాకి సంగీతం అందించనున్నారు. నిర్విరామంగా ఈ సినిమా షూటింగ్ నిర్వహించి వచ్చే ఏడాది మార్చి నెలాఖరుకి సినిమాను పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారు. వేసవికి సినిమాను రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది. ఈ సినిమాతో పాటు సమంత చేతిలో మరికొన్ని సినిమాలు ఉన్నాయి.
This post was last modified on December 9, 2021 8:54 am
టీడీపీ సీనియర్ నేత, తాడిపత్రి మునిసిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డితో నెలకొన్న వివాదాన్ని బీజేపీ మహిళా నేత, సినీ…
కొన్ని వెబ్ సిరీస్ లకు సినిమాల రేంజ్ హైప్ ఉంటుంది. ఫ్యామిలీ మ్యాన్, మీర్జాపూర్, స్కామ్ 1992 లాంటివి ఉదాహరణలు.…
సంక్రాంతికి వస్తున్నాం బ్లాక్ బస్టర్ సక్సెస్ దగ్గుబాటి అభిమానులకు ఇస్తున్న కిక్ అంతా ఇంతా కాదు. నలభై యాభై కాదు…
ఇటీవలే తన స్వంత అపార్ట్ మెంట్ లో దాడికి గురైన బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ కేసు రోజుకో…
డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేయడంతో మొదట వలసదారుల్లో టెన్షన్ నెలకొంది. మొట్ట మొదట ట్రంప్ ‘అమెరికా…
పట్టుబట్టారు.. సాధించారు. ఈ మాటకు ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎం, మంత్రి నారాయణ సహా.. నారా లోకే ష్ కూడా…