అప్పట్లో రాజకీయాల కోసం బ్రేక్ తీసుకున్నప్పుడు చిరంజీవి ఒక సినిమాలకి దూరమైపోయినట్టే అనుకున్నారంతా. కానీ ఆయన రీ ఎంట్రీ ఇచ్చారు. వస్తూనే ఖైదీ నంబర్ 150తో బ్లాక్ బస్టర్ కొట్టారు. ఆ తర్వాత ఆచి తూచి అడుగులేస్తూ ఒక్కో సినిమా చేసుకుంటూ వెళ్తారులే అని అందరూ అనుకున్నారు. కానీ ఆయన మెగాస్టార్. గ్యాప్ వచ్చినా స్పీడ్ తగ్గలేదు. అందుకే ఒకదాని తర్వాత ఒకటిగా సినిమాలను పట్టాలెక్కించారు. అరుదైన రికార్డును నెలకొల్పారు.
ప్రస్తుతం ఒకేసారి నాలుగు సినిమాల షూటింగ్స్‌లో పాల్గొంటున్నారు చిరంజీవి. ఈ విషయాన్ని ఆయన టీమ్ సగర్వంగా ప్రకటించింది. కొరటాల శివ డైరెక్షన్‌లో ‘ఆచార్య’ మోహన్ రాజా దర్శకత్వంలో ‘గాడ్‌ఫాదర్’, మెహెర్ రమేష్ డైరెక్షన్‌లో ‘భోళాశంకర్’లతో పాటు బాబి తెరకెక్కిస్తున్న తన 154వ సినిమా షూట్‌లోనూ బ్యాక్ టు బ్యాక్ పాల్గొంటున్నారు చిరంజీవి. ఇది ఆల్‌టైమ్ మెగా రికార్డ్ అంటూ సోషల్ మీడియా హోరెత్తుతోంది.
ఒకప్పుడు స్టార్ హీరోలు ఒకే సమయంలో చాలా సినిమాలకి వర్క్ చేసేవారు. సూపర్ స్టార్ కృష్ణ కెరీర్‌లో పది పైన సినిమాలు చేసిన సంవత్సరాలు చాలానే ఉన్నాయి. కానీ రాను రాను ఇండస్ట్రీ తీరు మారింది. భారీ చిత్రాలకు తెర లేచింది. మేకింగ్‌కి టైమ్ పట్టడం మొదలైంది. పైగా సినిమా సినిమాకీ లుక్ మార్చడం, మేకోవరం కావడం లాంటివాటిని హీరోలు ప్రెస్టీజియస్‌గా, చాలెంజింగ్‌గా తీసుకోవడంతో ఒక టైమ్‌లో ఒక సినిమాయే చేయగలిగే పరిస్థితి వచ్చింది.
దాంతో చాలామంది హీరోలు ఇప్పటికీ ఒక సమయంలో ఒక సినిమాయే చేస్తుంటారు. వరుస సినిమాలకు కమిటైనా అది లైన్‌లో పెట్టడం వరకే. షూటింగ్ మాత్రం ఒక సినిమాకే జరుగుతూ ఉంటుంది. అలాంటిది చిరంజీవి లాంటి స్టార్ హీరో ఒకేసారి నాలుగు భారీ చిత్రాలకు వర్క్ చేయడం మామూలు విషయం కాదు. పైగా ఈ వయసులో అంత ఎనర్జీతో ఇంత వర్క్ చేయడం నిజంగా గ్రేట్. ఈ రేర్ ఫీట్‌తో యంగ్ హీరోలకి దీటుగా నిలబడటం ఆయనకే చెల్లింది. మిగతా హీరోలు ఆయన్ని చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉందనిపిస్తోంది.
This post was last modified on December 7, 2021 10:27 am
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…