అల్లు అర్జున్ ఈ మధ్య అనుకోని ఓ చిన్న వివాదంలో చిక్కుకున్నాడు. ర్యాపిడో అనే బైక్ రైడ్ సర్వింగ్ యాప్ కోసం బన్నీ చేసిన యాడ్ పట్ల అభ్యంతరాలు వ్యక్తం కావడం తెలిసిందే. ఈ యాడ్ మధ్యలో ఓ వ్యక్తి ఆర్టీసీ బస్సు ఎక్కబోతుంటే అందులో జనాల మధ్య నలిగిపోతూ కష్టపడి ప్రయాణం చేయడం ఎందుకు.. చక్కగా ర్యాపిడో బుక్ చేసుకుని బైక్‌లో వెళ్లొచ్చు కదా అని బన్నీ చెప్పడం పట్ల తెలంగాణ ఆర్టీసీ వాళ్లకు ఆగ్రహం తెప్పించింది.
కొన్ని నెలల నుంచి టీఎస్ఆర్టీసీని నడిపిస్తున్న ఉన్నతాధికారి సజ్జనార్ ఈ యాడ్ పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. టీఎస్ ఆర్టీసీ తరఫున ర్యాపిడో కంపెనీకి, బన్నీకి నోటీసులు ఇప్పించారు. వెంటనే ఈ యాడ్ ఆపేయాలన్నారు. ఆర్టీసీని తక్కువ చేసేలా, కించపరిచేలా ఈ యాడ్ ఉందన్నది వారి అభ్యంతరం. దీనిపై టీఎస్ ఆర్టీసీ అధికారులు కోర్టు మెట్లు కూడా ఎక్కారు.
ఆర్టీసీ అధికారుల వాదనతో కోర్టు కూడా ఏకీభవించింది. ఈ యాడ్ అభ్యంతరకరమని పేర్కొంది. తక్షణం ఈ ప్రకటనను ఆపేయాలని ర్యాపిడో కంపెనీకి ఆదేశాలు జారీ చేసింది. ఐతే ఆర్టీసీ నుంచి నోటీసులు అందుకున్నాక ర్యాపిడో కంపెనీ ఈ ప్రకటనను కొంచెం మార్చింది. ఆర్టీసీ బస్సులో ప్రయాణించడాన్ని వ్యతిరేకించేలా ఉన్న డైలాగ్ తీసేసింది. కానీ మార్చిన ప్రకటనలో కూడా ఆర్టీసీ బస్సు మాత్రం కనిపిస్తూనే ఉంది.
ఇప్పుడు కోర్టు ఆదేశాల ప్రకారం పాతది, కొత్తది రెండు యాడ్స్ కూడా తీసేయాల్సి ఉంటుంది. ఆర్టీసీ బస్సు కనిపించడానికి వీల్లేదు. కోర్టు ఇలా ఆదేశించడంతో ర్యాపిడో కంపెనీ ఇక కొత్త యాడ్ షూట్ చేసుకోక తప్పకపోవచ్చు. హిందీలో ఇదే యాడ్‌ను రణ్వీర్ సింగ్ మీద తీశారు. అక్కడ ఇలాంటి అభ్యంతరాలేమీ రాలేదు. ఐతే ఈ వివాదం వల్ల ‘ర్యాపిడో’ పరోక్షంగా కొంత పబ్లిసిటీ అయితే వచ్చింది.
This post was last modified on December 5, 2021 10:32 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…