నందమూరి బాలకృష్ణ తన తండ్రి తర్వాత ఎంతో అభిమానించే సినీ నటుల్లో అక్కినేని నాగేశ్వరరావు ఒకరు. ఆయన పట్ల బాలయ్య అమితమైన ప్రేమాభిమానాలు, గౌరవభావం చూపించేవాడు ఒకప్పుడు. ఐతే మధ్యలో ఏం జరిగిందో ఏమో అక్కినేని కుటుంబానికి బాలయ్య దూరం అయిపోయాడు. నాగార్జునకు దూరం దూరం ఉంటూ వచ్చాడు. ఏఎన్నార్ చనిపోయినా చివరి చూపుకు బాలయ్య వెళ్లకపోవడం గమనార్హం. అంతలా అక్కినేని కుటుంబంతో ఏం ఇబ్బందులు ఉన్నాయో అని అంతా ఆశ్చర్యపోయారు.
ఆ తర్వాత కూడా బాలయ్య, నాగ్ కలిసి కనిపించిన దాఖలాలు దాదాపు లేవనే చెప్పాలి. మరి తెర వెనుక ఏం జరిగిందో ఏమో మీడియాలో అయితే ఏ సమాచారం లేదు. ఐతే ఇప్పుడు బాలయ్య తాను హోస్ట్ చేసే ‘అన్ స్టాపబుల్’ షోలో ఏఎన్నార్‌ను అనుకరించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
‘అన్ స్టాపబుల్’ మూడో ఎపిసోడ్లో బ్రహ్మానందం, అనిల్ రావిపూడి అతిథులుగా వచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఎపిసోడ్లో ఒక చోట బ్రహ్మానందం.. ఏఎన్నార్‌ను అనుకరించమంటూ బాలయ్యను అడిగాడు. బాలయ్య ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఓకే అంటూ పైకి లేచి ఏఎన్నార్‌లా హావభావాలు పలికిస్తూ అచ్చం ఆయన లాగే వాయిస్ మార్చి నిమిషం పాటు ఏకధాటిగా ఒక గ్రాంథిక డైలాగ్ చెప్పాడు.
బాలయ్య తన తండ్రిని చాలాసార్లు అనుకరించాడు కానీ.. ఇలా ఏఎన్నార్ హావభావాలను, సంభాషణలను అనుకరించిన సందర్భాలు ఎప్పుడూ చూసి ఉండరు. అందులోనూ అక్కినేని కుటుంబంతో అనుకోకుండా వచ్చిన విభేదాల నేపథ్యంలో బాలయ్య ఈ టైంలో ఇలా ఏఎన్నార్‌ను అనుకరించడం చర్చనీయాంశంగా మారింది. సోషల్ మీడియాలో ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. బాలయ్య బాగా ప్రిపేరయ్యే నాగేశ్వరరావును అనుకరించాడని ఆ వీడియో చూస్తే అర్థమవుతుంది.
This post was last modified on December 5, 2021 10:22 pm
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…
ప్రపంచం మెచ్చిన సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ తన భార్య సైరా భానుతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించడం ఫ్యాన్స్ ను…
ఇప్పటి వరకు పీపీపీ మోడల్ గురించే ప్రజలకు తెలుసు. అయితే.. తొలిసారి ఏపీలో పీపీపీపీ అనే 4-పీ ఫార్ములాను సీఎం…
యంగ్ హీరో నాగచైతన్య ప్రస్తుతం తన కెరీర్‌లోనే అత్యంత భారీ ప్రాజెక్టుల మీద దృష్టి సారిస్తున్నాడు. ప్రస్తుతం చందూ మొండేటి…
ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో చావు దెబ్బతిన్న వైసీపీ..ఇంకా పాఠాలు నేర్చుకున్న ట్టు కనిపించడం లేదు. ముఖ్యంగా…
ఇటీవలే నెట్ ఫ్లిక్స్ లో వచ్చాక దేవర 2 ఉంటుందా లేదా అనే దాని గురించి డిస్కషన్లు ఎక్కువయ్యాయి. డిజిటల్…