మూవీ మేకింగ్ అనేది అంత ఈజీ కాదు. అందుకే చాలా సినిమాలకి అనుకోని ఆటంకాలు వస్తుంటాయి. కానీ ‘ఇండియన్ 2’ పడుతున్న కష్టాలు మాత్రం సామాన్యమైనవి కాదు. అసలే శంకర్ సినిమా ఓ పట్టాన తెమలదు అనుకుంటే.. ‘ఇండియన్ 2’కి మొదటి నుంచీ ఏదో ఒక సమస్య వస్తూనే ఉంది. దాంతో ఇప్పటికీ ఆ సినిమా సెట్స్‌కి వెళ్లడానికి ఆపసోపాలు పడుతోంది. షూటింగ్ లొకేషన్‌లో జరిగిన క్రేన్ యాక్సిడెంట్ యూనిట్‌లోని కొందరి ప్రాణాలను తీసింది. సినిమా ఆగిపోవడానికి కారణమయ్యింది.
విచారణలు, కోర్టు కేసులంటూ కాలం గడిచిపోతుంటే ఏం చేయాలో తెలీక ఈలోపు వేరే సినిమాలకు కమిటయ్యాడు శంకర్. అది నిర్మాతలకు కోపం తెప్పించింది. తమ సినిమా పూర్తయ్యాకే శంకర్ వేరే సినిమాలు చేయాలంటూ కోర్టుకెక్కారు. అది ఎంతకీ తేలకపోవడంతో మీ గోల మీరే తేల్చుకోండి అని చెప్పింది కోర్టు. దాంతో ఇరు పార్టీలూ రాజీపడ్డాయి. సినిమాని సెట్స్‌కి తీసుకెళ్లడానికి రెడీ అయ్యాయి. ఇంతలో కాజల్ రూపంలో మరో సమస్య వచ్చింది. ప్రెగ్నెన్సీ కారణంగా ఆమె తప్పుకోవడంతో కొత్త హీరోయిన్‌ని వెతికే పనిలో పడిందట టీమ్. ఈ సినిమాలో హీరోయిన్ రెండు వయసుల్లో కనిపించాల్సి ఉంటుంది.
ఒకటి యంగ్.. రెండోది ఓల్డ్. రెండింటికీ సూటయ్యే హీరోయిన్ అవసరం కాబట్టి సెలెక్షన్‌కి ఎక్కువ సమయం పడుతోందట. త్రిషని తీసుకుంటారని అన్నారు కానీ ఇప్పుడు తమన్నా పేరు తెరపైకి వచ్చింది. తను కన్‌ఫర్మ్ అయినట్టే అంటున్నారు. ఇక ముఖ్య పాత్రలు పోషించాల్సిన వివేక్, నెడుమూడి వేణులిద్దరూ ఈ యేడు హఠాత్తుగా కన్ను మూశారు. ఆ క్యారెక్టర్స్‌నీ వేరేవాళ్లతో భర్తీ చేయాల్సి ఉంది.
మరోవైపు కమల్ ఆరోగ్యం గురించి ఆలోచించాల్సిన పరిస్థితి. రీసెంట్‌గా కరోనా బారిన పడిన ఆయన, కోలుకుని డిశ్చార్జ్ అయితే అయ్యారు కానీ కాస్త వీక్‌గా ఉన్నారని, కొన్నాళ్లపాటు ఎక్కువ రిస్కులు తీసుకోకూడదని డాక్టర్లు చెప్పారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. శంకర్ సినిమా, అందులోనూ ఇండియన్ 2 లాంటి భారీ సబ్జెక్ట్‌కి చాలా స్ట్రెయినవ్వాల్సి ఉంటుంది. కాబట్టి కమల్ మళ్లీ ఫిట్‌నెస్ కోసం కాస్త గ్యాప్ తీసుకునే చాన్స్ లేకపోలేదు. మరి ఈ కష్టాలన్నింటినీ దాటుకుని ఈ సినిమా ఎప్పటికి ముందుకెళ్తుందో ఏమో!
This post was last modified on December 5, 2021 1:42 pm
ఏపీలోని కూటమి సర్కారులో కీలక పాత్ర పోషిస్తున్న టీడీపీలో సీనియర్ నాయకుల వ్యవహారం కొన్నాళ్లుగా చర్చకు వస్తోంది. సీనియర్లు సహకరించడం…
కీలక నిర్ణయాన్ని తీసుకుంది రేవంత్ సర్కారు. హైదరాబాద్ మహానగరి విస్త్రతిని పెంచేస్తూ అంచనాల్ని సిద్ధం చేసింది. ఇప్పటివరకు హెచ్ఎండీఏ (హైదరాబాద్…
ఏపీ పర్యటనకు వచ్చిన కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా వద్ద ఏపీ సీఎం చంద్రబాబు…
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందన్నది చెప్పలేం. రాజకీయాలు రాజకీయాలే. ఇప్పుడు ఇలాంటి పరిణామమే ఎన్టీఆర్ జిల్లాలోనూ జరుగుతోంది. టీడీపీ ఎమ్మెల్యే…
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా శనివారం రాత్రి ఏపీ పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు ఏపీ…
అవును… టీడీపీ పట్ల తెలంగాణకు ఇప్పటికీ ఆశ చావలేదు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా తెలంగాణలో టీడీపీకి పెద్దగా…