రాజశేఖర్ నట వారసత్వాన్ని కొనసాగిస్తూ ఆయన ఇద్దరు కూతుళ్లూ సినీ రంగ ప్రవేశం చేశారు. కానీ ఇద్దరికీ కాలం కలిసి రాలేదు. ముందు రాజశేఖర్ పెద్దమ్మాయి శివానినే తెరంగేట్రం చేయాల్సింది. కానీ ఆమె హీరోయిన్‌గా మొదలైన బాలీవుడ్ మూవీ 2 స్టేట్స్ రీమేక్ మధ్యలోనే ఆగిపోయింది. ఈలోపు చిన్నమ్మాయి శివాత్మిక దొరసాని మూవీతో కథానాయికగా పరిచయం అయింది. ఆ సినిమా ఆమెకు నిరాశనే మిగిల్చింది.
ప్రస్తుతం ఆమె రంగమార్తాండలో ఓ కీలక పాత్ర చేస్తోంది. ఈలోపు శివాని మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అదే.. అద్భుతం. తేజా సజ్జా సరసన శివాని నటించిన ఈ చిత్రం రెండేళ్ల ముందు మొదలైనప్పటికీ.. రకరకాల కారణాలతో విడుదల ఆలస్యమైంది. ఎట్టకేలకు ఈ మధ్యే రిలీజైంది. కానీ దానికి థియేట్రికల్ రిలీజ్ కుదర్లేదు. హాట్ స్టార్ ద్వారా డైరెక్ట్ ఆన్ లైన్లో రిలీజ్ చేశారు. రెస్పాన్స్ ఏమంత గొప్పగా లేదు.
శివానికి ఈ సినిమా ద్వారా అంత మంచి పేరు కూడా రాలేదు. ఏ హీరోయిన్ అయినా థియేట్రికల్ రిలీజ్‌తోనే అరంగేట్రం చేయాలనుకుంటుంది కానీ.. శివానికి ఆ అదృష్టం దక్కలేదు. కనీసం రెండో సినిమాతో అయినా ఆమె వెండితెరపై సందడి చేస్తుందేమో అనుకుంటే.. అదీ జరగలేదు. శివాని, అదిత్ అరుణ్ కీలక పాత్రలు పోషించిన డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యును థియేటర్లలోనే రిలీజ్ చేయాలనుకున్నారు.
ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన్స్ లాంటి పెద్ద సంస్థ టేకప్ చేసింది. కానీ తర్వాత ఏమైందో ఏమో.. ఈ చిత్రాన్ని ఓటీటీకి ఇచ్చేశారన్నది తాజా సమాచారం. ఈ మధ్యే తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన సోనీ లివ్ సంస్థ డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు చిత్ర డిజిటల్ హక్కులను సొంతం చేసుకుందట. కళ్యాణ్ రామ్‌తో 118 లాంటి హిట్ సినిమాను తీసిన సినిమాటోగ్రాఫర్ టర్న్డ్ డైరెక్టర్ కేవీ గుహన్ ఈ చిత్రాన్ని రూపొందించాడు.
This post was last modified on December 5, 2021 8:45 am
సోషల్ మీడియా ప్రపంచంలో నెగటివిటీ ఎంతగా పెరిగిపోయిందంటే గాలి కన్నా వేగంగా ఇదే ప్రయాణిస్తోంది. కొందరి ఆలోచనలను, వ్యక్తిత్వాలను తీవ్రంగా…
పన్నెండు సంవత్సరాలు ఒక సినిమా విడుదల కాకుండా ల్యాబ్ లో మగ్గితే దాని మీద ఎవరికీ పెద్దగా ఆశలు ఉండవు.…
ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్‌తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…