బుల్లితెరపై అనసూయది పూర్తిగా గ్లామర్ ఇమేజ్. సినిమాల్లో అవకాశాలు వస్తే ఆ ఇమేజ్‌కు తగ్గ పాత్రలే చేస్తుందని అనుకున్నారు కానీ.. ఆమె మాత్రం అక్కడ డిఫరెంట్ రూట్లో వెళ్లింది. ఎక్కువగా పెర్ఫామెన్స్ ఓరియెంటెడ్ క్యారెక్టర్లే చేసింది. క్షణం, రంగస్థలం లాంటి సినిమాలు ఆమెకు ఎంత మంచి పేరు తెచ్చాయో తెలిసిందే. ఇప్పుడు అనసూయ కెరీర్‌లో మరో గుర్తుండిపోయే పాత్ర కాగలదని పుష్ప మూవీలో ద్రాక్షాయణి పాత్ర మీద అంచనాలున్నాయి.
ఈ పాత్ర ఫస్ట్ లుక్ చూసే జనాలు స్టన్ అయిపోయారు. రంగస్థలంలో రంగత్తమ్మగా పూర్తి పాజిటివ్ క్యారెక్టర్ చేసిన అనసూయ.. పుష్పలో మాత్రం నెగెటివ్ రోల్ చేస్తోంది. షార్ట్ హెయిర్‌తో, ఒంటి నిండా నగలతో ఆడంబరంగా.. ఊర మాస్‌గా కనిపించిన అనసూయ లుక్ అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇప్పుడు పుష్ప ట్రైలర్ గ్లింప్స్‌లో అనసూయ కనిపించిన షాట్ చూసి మరింతగా షాకవుతున్నారు జనం. సోమవారం ట్రైలర్ లాంచ్ కానున్న నేపథ్యంలో అర నిమిషం నిడివితో దాని గ్లింప్స్ ఒకటి వదిలారు.
అందులో హీరో అల్లు అర్జున్‌ను మించి అందరి దృష్టినీ ఆకర్షించింది అనసూయే. ఒక మగాడి మీద కూర్చుని, చీర లేకుండా కేవలం జాకెట్‌తో కనిపిస్తున్న అనసూయ.. నోట్లో బ్లేడు పెట్టుకుని ఫెరోషియస్‌గా కనిపిస్తోంది. ఆ బ్లేడుతో ఆ వ్యక్తి మెడ కోయబోవడమే నెక్స్ట్ షాట్ కావచ్చు. దీన్ని బట్టి సినిమాలో అనసూయ పాత్ర చాలా వయొలెంట్‌గా ఉంటుందని అంచనా కలుగుతోంది. అనసూయ తన కెరీర్లో ఇలాంటి పాత్ర ఇప్పటిదాకా చేయలేదు. నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు చేసినా.. ఇంత వయొలెన్స్ మాత్రం ఆమె నుంచి చూడలేదు. కచ్చితంగా ద్రాక్షాయణి పాత్ర ఒక సెన్సేషనే అవుతుందేమో అనిపిస్తోంది. ట్రైలర్లో, సినిమాలో ఈ పాత్ర ఇంకెంత ఇంపాక్ట్ వేస్తుందో చూడాలి.
This post was last modified on December 4, 2021 11:37 am
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…