సినిమా తీయడం ఎంత ముఖ్యమో దాన్ని ప్రమోట్ చేయడం అంతకంటే ముఖ్యం. జనాలు థియేటర్‌కి వచ్చి సినిమా చూడాలంటే, ముందు సినిమా జనం దగ్గరికి వెళ్లాలి. అందుకే ప్రమోషన్స్‌ని రకరకాలుగా ప్లాన్ చేస్తుంటారు మేకర్స్. ఆ విషయంలో పుష్ప టీమ్ పదాకులు ఎక్కువే చదివిందనిపిస్తోంది.
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కిస్తున్న పుష్ప చిత్రం డిసెంబర్ 17న విడుదల కాబోతోంది. ఆల్రెడీ పాటలు, పోస్టర్లతో రికార్డులు సృష్టిస్తున్నారు. మరో నాలుగు రోజుల్లో ట్రైలర్ కూడా రాబోతోంది. ఇదంతా మనకి తెలిసిన విషయం. తెలియకుండా వెనుక వేరే ప్లాన్స్ నడుస్తున్నాయి. అందులోనూ నార్త్‌లో ఈ చిత్రాన్ని మరింత స్పెషల్‌గా ప్రమోట్ చేయబోతున్నారు మేకర్స్.
బన్నీ నటిస్తున్న మొట్టమొదటి ప్యాన్ ఇండియా చిత్రమిది. తనకి ఆల్రెడీ తమిళ, మలయాళ భాషల్లో ఫుల్ ఫాలోయింగ్ ఉంది. బాలీవుడ్‌లో కూడా అభిమానులు ఉన్నారు కానీ, వారి అభిమానం ఏ రేంజ్‌లో ఉందనేది క్లియర్‌గా తెలియదు. అందుకే అక్కడి వారికి రీచ్ అవ్వడానికి స్పెషల్ స్కెచ్ వేసింది పుష్ప టీమ్. బన్నీని బిగ్‌బాస్ షోకి గెస్ట్‌గా పంపబోతోంది. హిందీ బిగ్‌బాస్‌కి చాలా యేళ్లుగా సల్మాన్ ఖాన్ హోస్టుగా వ్యవహరిస్తున్నాడు. ఈ యేడు కూడా తనే హోస్ట్ చేస్తున్నాడు. వీకెండ్ ఎపిసోడ్‌లో ఇతర హీరోలు వచ్చి ఆ వేదిక మీద తమ సినిమాలను ప్రమోట్ చేసుకుంటూ ఉంటారు. ఈసారి బన్నీ కూడా వెళ్లబోతున్నట్లు నార్త్ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
బేసిగ్గా మెగా ఫ్యామిలీకి సల్లూ చాలా క్లోజ్. అందుకే ‘గాడ్‌ఫాదర్’లోనూ నటిస్తున్నాడు. ఆ సాన్నిహిత్యం కూడా అల్లు అర్జున్‌కి కలిసొచ్చిందంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. అదే కనుక జరిగితే, సల్మాన్ లాంటి స్టార్ హీరో ప్రమోట్ చేస్తే.. నార్త్ ఇండియన్స్‌కి పుష్పరాజ్ రీచ్ అవడం మరింత తేలికవుతుంది. కాబట్టి ఇది నిజంగా బెస్ట్ ఐడియా అనే చెప్పాలి.
This post was last modified on December 3, 2021 10:59 am
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…